logo

భువనగిరి ఖిల్లాపై తెదేపాదే హవా

రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన నియోజకవర్గాలో భువనగిరి ఒకటి. చారిత్రక ప్రాశస్త్యం.. రాజకీయ ప్రాముఖ్యత సంతరించుకుంది. తెలంగాణ సాయుధ పోరాట సేనాని రావి నారాయణరెడ్డి తొలిసారి జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పీడీఎఫ్‌ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.

Updated : 31 Oct 2023 05:52 IST

మాధవ్‌ దంపతులకు ఏడు వరుస విజయాలే..
మూడు దశాబ్దాలు ఏలిన ఎలిమినేటి కుటుంబం

ఎలిమినేటి మాధవరెడ్డి, ఉమామాధవరెడ్డి

భువనగిరి, న్యూస్‌టుడే: రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన నియోజకవర్గాలో భువనగిరి ఒకటి. చారిత్రక ప్రాశస్త్యం.. రాజకీయ ప్రాముఖ్యత సంతరించుకుంది. తెలంగాణ సాయుధ పోరాట సేనాని రావి నారాయణరెడ్డి తొలిసారి జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పీడీఎఫ్‌ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. అలాంటి రాజకీయ ప్రాముఖ్యమున్న నియోజవర్గంలో వారు పోటీలో ఉన్నంత వరకు 16 సార్లు జరిగిన ఎన్నికల సమరంలో అత్యధిక సార్లు విజయం సొంతం చేసుకున్న ఘనత ఎలిమినేటి మాధవరెడ్డి కుటుంబానిదే. ఎలిమినేటి మాధవరెడ్డి, ఆయన భార్య ఎలిమినేటి ఉమామాధవరెడ్డి ఏడు సార్లు వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగించారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ 1989, 2004లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినా విజయం వారినే వరించింది. 1985 నుంచి కాంగ్రెస్‌కు స్థానం లేకుండా చేశారు. రావి నారాయణరెడ్డి, కొండా లక్ష్మణ్‌ బాపూజీ, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కొమ్మడి నర్సింహారెడ్డి లాంటి హేమాహేమీలు ఈ స్థానం నుంచి ఎన్నికైనా.. రెండుసార్లు సార్లు మాత్రమే విజయం సాధించారు. యువ నాయకుడిగా, మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి భువనగిరి ఎమ్మెల్యేగా తెదేపా నాయకుడిగా.. మంత్రిగా.. ఉమ్మడి నల్గొండ జిల్లాపై చెరగని ముద్ర వేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. ఎన్టీఆర్‌.. చంద్రబాబు మంత్రివర్గంలో మాధవరెడ్డి, ఉమామాధవరెడ్డి రాష్ట్ర కేబినెట్‌ మంత్రులుగా పనిచేశారు. 

భువనగిరి పట్టణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని