logo

ఆ తండ్రీ కొడుకులు.. మునుగోడు ఎమ్మెల్యేలు

ప్రస్తుతం దేవరకొండ నియోజకవర్గంలో ఉన్న చింతపల్లి మండలం నియోజకవర్గాల పునర్విభజనకు ముందు మునుగోడులో ఉండేది.

Updated : 28 Nov 2023 07:11 IST

ప్రస్తుతం దేవరకొండ నియోజకవర్గంలో ఉన్న చింతపల్లి మండలం నియోజకవర్గాల పునర్విభజనకు ముందు మునుగోడులో ఉండేది. చింతపల్లి మండలం ఘడియగౌరారం గ్రామానికి చెందిన కమ్యూనిస్టు నాయకుడు దివంగత ఉజ్జిణి నారాయణరావు తెదేపా మిత్రపక్షంతో మునుగోడు బరిలో మూడు పర్యాయాలు విజయం సాధించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, రజాకార్లకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన ఈయన 1985-99 కాలంలో సీపీఐ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. తదనంతరం 2009-14 వరకు ఆయన తనయుడు ఉజ్జిణి యాదగిరిరావు కూడా అదే నియోజకవర్గం నుంచి సీపీఐ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

దేవరకొండ, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని