logo

ఐదు రోజుల్లో కొనుగోళ్లు పూర్తి

ధాన్యం కొనుగోళ్లు ఐదు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం సహకార, పౌరసరఫరాలశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. కేంద్రాల్లో నిల్వలు

Published : 09 Dec 2021 03:15 IST

లక్ష్మాపూర్‌లో రైతులకు అవగాహన కల్పిస్తున్న కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోళ్లు ఐదు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం సహకార, పౌరసరఫరాలశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. కేంద్రాల్లో నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు లారీలను పంపించాలని పేర్కొన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్నే విక్రయించాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పని చేసి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పౌరసరఫరాలశాఖ డీఎం జితేంద్ర ప్రసాద్‌, డీసీవో వసంత, ఆర్డీవో శ్రీను తదితరులు పాల్గొన్నారు.
హెచ్‌ఆర్‌ పెంచాలని వినతి.. కామారెడ్డి కలెక్టరేట్‌ : ఉపాధ్యాయులకు హెచ్‌ఆర్‌ పెంచాలని పీఆర్టీయూ ఆధ్వర్యంలో కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఏళ్ల నాటి హెచ్‌ఆర్‌ను సవరించాలని జిల్లా అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి కోరారు.

పంట మార్పిడితో భూములు సారవంతం
ఎల్లారెడ్డి పురపాలిక, లింగంపేట, తాడ్వాయి : యాసంగిలో పంట మార్పిడితో భూములు సారవంతమవుతాయని జిల్లా పాలనాధికారి జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. బుధవారం లింగంపేట, లక్ష్మాపూర్‌, కృష్ణాజివాడిలో ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. అటవీప్రాంతంలో చేపడుతున్న కందాలను పరిశీలించారు. లింగంపేట పీహెచ్‌సీని తనిఖీ చేశారు. 983 సర్వే నంబరులోని భూములకు రైతుబంధు సొమ్ము ఇప్పించాలని కర్షకులు కోరగా పరిశీలిస్తామన్నారు. ఎల్లమ్మతండా బృహత్‌ వనంలో మొక్క నాటి నీరు పోశారు. జిల్లా వ్యవసాయాధికారిని భాగ్యలక్ష్మి, ఏడీఏ రత్నం, తహసీల్దార్‌ అంజయ్య, ఎంపీవో ప్రకాశ్‌, ఏపీవో సక్కుబాయి తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని