logo

కామారెడ్డిలో వాహనాల తనిఖీ

రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు కొవిడ్‌ కట్టడికి జిల్లా కేంద్రంలో ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి పర్యవేక్షణలో గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నంబరు ప్లేట్లు లేని వాహనాలతో పాటు శిరస్త్రాణం, మాస్కులు ధరించకుండా వెళ్తున్న వారే

Published : 21 Jan 2022 03:35 IST

స్వయంగా పరిశీలిస్తున్న ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, ఏఎస్పీ అన్యోన్య

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు కొవిడ్‌ కట్టడికి జిల్లా కేంద్రంలో ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి పర్యవేక్షణలో గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నంబరు ప్లేట్లు లేని వాహనాలతో పాటు శిరస్త్రాణం, మాస్కులు ధరించకుండా వెళ్తున్న వారే లక్ష్యంగా తనిఖీలు నిర్వహించారు. నిజాంసాగర్‌ చౌరస్తా, కొత్త బస్టాండు, పాత బస్టాండు, ఇందిరా చౌక్‌, స్టేషన్‌రోడ్డు, సిరిసిల్ల రోడ్డు తదితర ప్రాంతాల్లో పరిశీలించారు. శిరస్త్రాణం లేని 173 మందికి, మాస్కు లేని 101 మంది జరిమానాలు విధించారు. 43 ద్విచక్రవాహనాలను ఠాణాకు తరలించారు. ఏఎస్పీ అన్యోన్య, కామారెడ్డి డీఎస్పీ సోమనాథం, పట్టణ సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని