logo

నియంత్రిక దగ్ధం.. రూ.37 లక్షల నష్టం

బర్దీపూర్‌ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన 2000 కేవీ కెపాసిటీ గల భారీ నియంత్రికలో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. పూర్తిగా దగ్ధమవడంతో దాదాపు రూ.37 లక్షల నష్టం వాటిల్లినట్లు కర్షకులు చెప్పారు.

Published : 03 Feb 2023 06:01 IST

ఎగసిపడుతున్న మంటలు

డిచ్‌పల్లి గ్రామీణం : బర్దీపూర్‌ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన 2000 కేవీ కెపాసిటీ గల భారీ నియంత్రికలో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. పూర్తిగా దగ్ధమవడంతో దాదాపు రూ.37 లక్షల నష్టం వాటిల్లినట్లు కర్షకులు చెప్పారు. ఈ విషయంపై రైతులు మాట్లాడుతూ.. ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ సహకారంతో ఆయకట్టు వారందరం కలిసి నియంత్రికను మంజూరు చేయించుకున్నట్లు తెలిపారు. గతేడాది మార్చిలో దీన్ని బిగించుకోగా.. నిర్వహణను తామే చూసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాలిపోవడంతో ఇబ్బందులు వస్తాయని, మరో నియంత్రికను ప్రభుత్వం మంజూరు చేయాలని కోరారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని విద్యుత్తు శాఖ ఎస్‌ఈ రవీందర్‌, అధికారులు ఉత్తమ్‌, రాజేశ్వర్‌, రాజేందర్‌, నీటి పారుదలశాఖ అధికారులు గంగాధర్‌, శ్రీచంద్‌, కిరణ్‌ పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని