logo

200 మందికి ఉపాధి లక్ష్యం

గ్రామాల్లో ఉపాధి పనుల జోరు పెంచాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి గ్రామ పంచాయతీలో 200 మంది కూలీల కంటే ఎక్కువగా హాజరు ఉండాలని పేర్కొంది. దీంతో జిల్లా యంత్రాంగం ఉపాధి కూలీల సంఖ్య పెరగడంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Updated : 24 Apr 2024 06:43 IST

పంచాయతీల్లో కూలీల పెంపుపై దృష్టి

ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: గ్రామాల్లో ఉపాధి పనుల జోరు పెంచాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి గ్రామ పంచాయతీలో 200 మంది కూలీల కంటే ఎక్కువగా హాజరు ఉండాలని పేర్కొంది. దీంతో జిల్లా యంత్రాంగం ఉపాధి కూలీల సంఖ్య పెరగడంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఉపాధి కూలీల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో జిల్లాకు రావాల్సిన మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు చాలా తక్కువగా వచ్చాయి. ఈ ఏడాది వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి కల్పించడానికి అధికారులు యత్నిస్తున్నారు.

కూలి పెరిగినా అనాసక్తే..

ఉపాధిహామీ పథకంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కూలీల వేతనాలు పెరిగాయి. గతంలో రూ.272 చెల్లించేవారు. ఇప్పుడు నిత్యం రూ.300 చెల్లించాలని సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు వ్యవసాయ, వ్యవసాయేతర పనులకు నిత్యం రూ.500లకు పైగా చెల్లిస్తున్నారు. దీంతో కూలీలు ఉపాధిహామీ పనులు చేయడానికి అనాసక్తి కనబరుస్తున్నారు. ఉన్నతాధికారులు ఎంత అవగాహన కల్పించినా వారి నుంచి స్పందన రావడం లేదు. ఎక్కువ మందికి కూలీలకు ఉపాధి కల్పిస్తే రాష్ట్రానికి రావాల్సిన మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో వివిధ అభివృద్ధి పనులు చేసుకునే అవకాశం ఉంది.

ఒక్కసారిగా రెట్టింపు చేయడంతో..

ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఒక్కో పంచాయతీకి నిత్యం 50 మంది కూలీల హాజరును అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. తర్వాత 75 నుంచి 100కు పెంచారు. క్రమంగా లక్ష్యాలను పెంచుకుంటూ వెళ్లడంతో అధికారులు కూడా సాధించారు. ప్రస్తుతం లక్ష్యాన్ని ఒక్కసారిగా రెట్టింపు చేశారు. ఇప్పుడు ఒక్కో పంచాయతీలో సరాసరిగా 115 మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని