logo

స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే పరిస్థితి లేదు: కొత్తపల్లి

జాతీయ రహదారుల్లో ప్రయాణిస్తే ప్రధాని మోదీ వేసిన రోడ్లు అని.. ఎన్‌హెచ్‌ దిగితే కేడీ రోడ్లు (రాష్ట్ర ప్రభుత్వం వేసినవి) దర్శనమిస్తున్నాయని భాజపా అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత విమర్శించారు.

Published : 16 Apr 2024 05:36 IST

మాట్లాడుతున్న అరకు ఎంపీ అభ్యర్థి గీత, చిత్రంలో నిమ్మక జయకృష్ణ, పిసిని చంద్రమోహన్‌

పాలకొండ, గ్రామీణం, న్యూస్‌టుడే: జాతీయ రహదారుల్లో ప్రయాణిస్తే ప్రధాని మోదీ వేసిన రోడ్లు అని.. ఎన్‌హెచ్‌ దిగితే కేడీ రోడ్లు (రాష్ట్ర ప్రభుత్వం వేసినవి) దర్శనమిస్తున్నాయని భాజపా అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత విమర్శించారు. పాలకొండ పట్టణంలో ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణతో కలిసి సోమవారం రోడ్‌షో నిర్వహించారు. ముందుగా కోటదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కూడలి నుంచి కాపువీధులు, కస్పావీధి, మేదరవీధి, గొల్లవీధి, దేవరపేట మీదుగా ఏలాం కూడలి వరకు ప్రచారం చేశారు. అనంతరం తెదేపా సీనియర్‌ నాయకుడు సుంకరి అనిల్‌దత్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘శ్రీకాకుళం మీదుగా పాలకొండ వస్తున్న రోడ్లు దారుణంగా ఉన్నాయి. నా వాహనం కూడా వైకాపా రోడ్లకు మొరాయించింది. గత మూడు రోజులుగా ప్రధాన నాయకులపై రాళ్ల దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. దీనిపై ఎన్నికల సంఘం, డీజీపీ సత్వర చర్యలు చేపట్టాలి. ఈ పరిస్థితుల్లో అభ్యర్థులు ప్రచారం చేయాలంటే భయపడుతున్నారు. పాలకొండ ఐటీడీఏ నిస్తేజంగా మారింది. గిరిజనాభివృద్ధి నిలిచిపోయింది. నాగావళి నది పక్కనే ఉన్నా ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఏనుగుల సమస్య ఉన్నా ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని’ ఆరోపించారు. జనసేన జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్‌, దమయంతినాయుడు, తేజోవతి, సంతోష్‌, రామినాయుడు, కృష్ణమూర్తినాయుడు, హిమరిక ప్రసాద్‌, గర్భాన సత్తిబాబు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని