logo

పోలింగ్‌ పర్యవేక్షణలో సూక్ష్మ పరిశీలకులు కీలకం

పోలింగ్‌ ప్రక్రియ నిబంధనల మేరకు సాగేలా పర్యవేక్షించడంలో సూక్ష్మ పరిశీలకులది కీలకపాత్ర అని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ సూచించారు. సూక్ష్మ పరిశీలకులగా నియమితులైన 410 మంది బ్యాంక్‌, ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఒంగోలు ప్రకాశం భవన్‌లోని స్పందన సమావేశ మందిరంలో మంగళవారం ప్రత్యేక శిక్షణ నిర్వహించారు.

Published : 17 Apr 2024 03:43 IST

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌.. చిత్రంలో ఎల్‌డీఎం అబ్దుల్‌ రహీం, పాల్గొన్న సూక్ష్మ పరిశీలకులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: పోలింగ్‌ ప్రక్రియ నిబంధనల మేరకు సాగేలా పర్యవేక్షించడంలో సూక్ష్మ పరిశీలకులది కీలకపాత్ర అని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ సూచించారు. సూక్ష్మ పరిశీలకులగా నియమితులైన 410 మంది బ్యాంక్‌, ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఒంగోలు ప్రకాశం భవన్‌లోని స్పందన సమావేశ మందిరంలో మంగళవారం ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పోలింగ్‌ కేంద్రంలోని సిబ్బంది తమకు సంబంధించిన నియమావళిని ఎలాంటి ఉల్లంఘన లేకుండా పాటిస్తున్నారో లేదా చూడాల్సిన బాధ్యత సూక్ష్మ పరిశీలకులపై ఉందన్నారు. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా, రీపోలింగ్‌ పరిస్థితి తలెత్తకుండా స్వేచ్ఛగా, సజావుగా ప్రక్రియ నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఓటింగ్‌ ప్రక్రియ, భద్రతా ఏర్పాట్లు, వెబ్‌ కెమెరాల ఏర్పాటు విధానం, వాటి పనితీరును పరిశీలించడంతో పాటు, మాక్‌ పోలింగ్‌ నిర్వహణ మొదలు ఈవీఎంల అనుసంధానం వరకు గమనించాలని సూచించారు. సమావేశంలో ఎల్‌డీఎం అబ్దుల్‌ రహీం, ఇతర అధికారులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని