icon icon icon
icon icon icon

Nara Lokesh: ప్రకాశం జిల్లాను ఫార్మాహబ్‌గా చేస్తాం: నారా లోకేశ్‌

ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్‌గా చేసే బాధ్యత తీసుకుంటానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.

Published : 30 Apr 2024 19:25 IST

ఒంగోలు: ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్‌గా చేసే బాధ్యత తీసుకుంటానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నిర్వహించిన యువగళం సభలో ఆయన ప్రసంగించారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరందించే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు.

‘‘అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నాది. పక్క రాష్ట్ర ప్రజలు రాష్ట్రానికి వచ్చేలా చర్యలు చేపడతాం. నాడు ఒక్క అవకాశం అని చెబితే మాయలో పడ్డారు.. నేడు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది.  తెదేపా తెచ్చిన కంపెనీలు ఇప్పుడు పక్క రాష్ట్రానికి తరలిపోయాయి. పాదయాత్రలో ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకున్నా. ప్రజా సమస్యల పరిష్కారాలను మేనిఫెస్టోలో పొందుపరిచాం. తెదేపా హయాంలో జిల్లాల వారీగా ప్రాధాన్యం కల్పించాం. నిలిచిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తాం. కూటమి వచ్చిన వంద రోజుల్లో పెట్టుబడులకు పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయి.

నాపై 23 కేసులు పెట్టారు..

ప్రజల కోసం పోరాడినందుకు నాపై 23 కేసులు పెట్టారు. మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు. వైకాపా చేసిన తప్పులను ప్రజల ముందుంచాం. సమర్థ నాయకత్వం అందించే అభ్యర్థులను గెలిపించాలి. తప్పు చేసిన అధికారులను ఉపేక్షించేది లేదు. చట్టాలను కొంత మంది చుట్టాలుగా మార్చారు. చట్టాలను ఉల్లంఘించిన అధికారులను వదిలిపెట్టేది లేదు. వారి పేర్లు రెడ్‌ బుక్‌లో ఉన్నాయి. అభివృద్ధి ద్వారా వచ్చే ఆర్థిక వనరులను పేదలకు ఖర్చు పెడతాం. తెదేపా హయాం నాటి పథకాలను వైకాపా రద్దు చేసింది. రద్దు చేసిన సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం’’ అని లోకేశ్ భరోసా కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img