TDP: కూటమిదే గెలుపని సర్వేలన్నీ చెబుతున్నాయి: గంటా శ్రీనివాసరావు

కూటమిదే గెలుపని సర్వేలన్నీ చెబుతున్నాయని తెదేపా నేత గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో నిర్వహించిన తెదేపా నేతల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated : 22 May 2024 13:26 IST

విశాఖ: కూటమిదే గెలుపని సర్వేలన్నీ చెబుతున్నాయని తెదేపా నేత గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో నిర్వహించిన తెదేపా నేతల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్‌ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారన్నారు. 

రాష్ట్రంలో అన్ని శాఖలు పడకేశాయని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. ‘‘ఎన్ని సీట్లు వస్తున్నాయో జగన్‌ చెబితే ఐప్యాక్‌ టీమ్‌ చప్పట్లు కొడుతోంది. ఎన్నిసీట్లు వస్తాయో చెప్పాల్సింది ఐప్యాక్‌ టీమ్‌ కదా? వైద్య శాఖ అనారోగ్య స్థితిలో ఉంది. వైకాపా నేతల మాదిరిగా నేను అవినీతి చేయలేదు. వైకాపా నేతల ఆరోపణలపై నెల్లూరులో సమాధానం చెబుతా’’ అని సోమిరెడ్డి తెలిపారు. 

సీఎస్‌ను మారిస్తే అన్నీ సర్దుకుంటాయి: రఘురామ

ఈవీఎంల ధ్వంసంపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కఠినంగా శిక్షించాలని రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు. జూన్‌ 4 తర్వాత వైకాపా పని అయిపోతుందని జోస్యం చెప్పారు. ఆ పార్టీ దారుణ పరాజయాన్ని చూడబోతుందని తెలిపారు. బటన్‌ నొక్కడమే గానీ.. ఆరోగ్యశ్రీకి బిల్లులు చెల్లించలేదని పేర్కొన్నారు. సీఎస్‌ను మారిస్తే అన్నీ సర్దుకుంటాయని రఘురామ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని