logo

‘మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్న వైకాపా’

హిందూ ఆలయాలు నిర్మిస్తే కేసులు పెడతామని బెదిరించడం, తీర్థాలు వంటివి జరగనీయకుండా అడ్డుకోవడం వైకాపా అరాచక పాలనకు పరాకాష్ఠని మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌రాజు విమర్శించారు. పార్టీ ఇన్‌ఛార్జి తాతయ్యబాబుతో మంగళవారం కొత్తకోట వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు.

Published : 19 Jan 2022 05:23 IST
నాయకులతో కలిసి మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రాజు

రావికమతం, న్యూస్‌టుడే: హిందూ ఆలయాలు నిర్మిస్తే కేసులు పెడతామని బెదిరించడం, తీర్థాలు వంటివి జరగనీయకుండా అడ్డుకోవడం వైకాపా అరాచక పాలనకు పరాకాష్ఠని మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌రాజు విమర్శించారు. పార్టీ ఇన్‌ఛార్జి తాతయ్యబాబుతో మంగళవారం కొత్తకోట వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. కిత్తంపేటలో సర్పంచితో రాముల వారి తీర్థాన్ని జరిపించాలని చూడటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. తెదేపా నాయకులను స్టేషన్‌కు తీసుకొచ్చి కేసులు పెడతామని పోలీసులు భయపెట్టి ఏకపక్షంగా వ్యవహరించారని తెలిపారు. గుడ్డిపలో అప్పన్న స్వామి ఆలయం కట్టకుండా బెదిరించి ఆపివేయించారన్నారు. ఇదంతా హిందువుల సంప్రదాయాలపై అధికార పార్టీ నాయకులు, పోలీసులు కలిసి చేస్తున్న దాడిగా రాజు ఆరోపించారు. ప్రభుత్వం, అధికారం శాశ్వతం కాదన్నారు. అతిగా ప్రవర్తించినా, ఏకపక్షంగా వ్యవహరించినా.. మీరంతా మునుముందు బాధపడాల్సి వస్తుంది. కిత్తంపేట అధికార పార్టీ నాయకులు గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో పోటీ పడండి. మీ పార్టీ అధికారంలో ఉండగా ఈ మూడేళ్లలో గ్రామానికి మీరేం చేశారో, మేం అధికారంలో ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేశామో త్వరలో గ్రామంలో మీటింగ్‌ పెట్టి చర్చిద్దామని తెలిపారు. తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లునాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు కొండనాయుడు, తెలుగు మహిళా అధ్యక్షురాలు కోట నీలవేణి, మాజీ సర్పంచి కర్రి అర్జున, టి.అర్జాపురం సర్పంచి మడగల అర్జున, కోట గోవిందరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని