logo

చిత్ర వార్తలు

మామూలుగా వదిలేస్తే అవి బండరాళ్లే. కానీ, కాస్త కళాత్మకంగా తీర్చిదిద్దితే చూడముచ్చటగా మారాయి. రుషికొండ సమీపంలోని ఓ హోటల్‌లో పర్యాటకుల్ని ఆకట్టుకొనే విధంగా చిన్న చిన్న బండరాళ్లపై వివిధ రకాల బొమ్మలను ఇలా తీర్చిదిద్దారు. 

Updated : 28 Jan 2022 05:15 IST

రాయి రాత.. మారిందిలా!

మామూలుగా వదిలేస్తే అవి బండరాళ్లే. కానీ, కాస్త కళాత్మకంగా తీర్చిదిద్దితే చూడముచ్చటగా మారాయి. రుషికొండ సమీపంలోని ఓ హోటల్‌లో పర్యాటకుల్ని ఆకట్టుకొనే విధంగా చిన్న చిన్న బండరాళ్లపై వివిధ రకాల బొమ్మలను ఇలా తీర్చిదిద్దారు. 

- ఈనాడు, విశాఖపట్నం


పెదపాడులో.. దాహం కేకలు

డుంబ్రిగుడలో ఖాళీ బిందెలతో ఆందోళన చేస్తున్న గిరిజనులు

పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామ పీటీజీ గిరిజనులు తమకు తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ మండల కేంద్రంలోని మూడు రోడ్ల కూడలిలో ఆందోళనకు దిగారు. మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో ధర్నా చేపట్టారు. గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూర్యనారాయణ, సీపీఎం మండల కార్యదర్శి పోతురాజు మాట్లాడుతూ రూ.5 లక్షలతో నిర్మించిన గ్రావిటీ పథకాన్ని అసంపూర్తిగా వదిలేశారన్నారు. రెండేళ్లు గడుస్తున్నా పనులు చేపట్టకపోవడంతో ఊటగెడ్డల ద్వారా గిరిజనులు నీరు తెచ్చుకుంటూ వ్యాధులబారిన పడుతున్నారన్నారు. తక్షణమే తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

-డుంబ్రిగుడ, న్యూస్‌టుడే


ఈ మీనం... ఆకర్షణీయం!

విశాఖలోని రుషికొండ సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు గురువారం ఆకర్షణీయ చేప చిక్కింది. దీన్ని ప్యారెట్‌ ఫిష్‌ (రామచిలుక) చేపగా పిలుస్తారని జాలర్లు పేర్కొన్నారు. ఎక్కువగా సముద్రం అడుగు భాగంలోని రాళ్ల ప్రదేశాల్లో మనుగడ సాగించే ఈ చేపలు అరుదుగా బయటకు వస్తుంటాయన్నారు. వీటి ధర కిలో సుమారు రూ.400 నుంచి 500 వందల వరకు ఉంటుందన్నారు. ఇది ఒక్కొక్కటి దాదాపు 15 కిలోల బరువు పెరుగుతుందన్నారు.

- న్యూస్‌టుడే, విశాఖపట్నం(సాగర్‌నగర్‌)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని