logo

పౌర గ్రంథాలయంలో ‘మియావాకి’ గది ప్రారంభం

ద్వారకానగర్‌లోని విశాఖ పౌర గ్రంథాలయాన్ని జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీశ బుధవారం సందర్శించారు. ఆయన్ను గ్రంథాలయ కార్యదర్శి డి.ఎస్‌.వర్మ అన్ని విభాగాలను చూపించారు. పిల్లల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన ‘మియావాకి(జపాన్‌లోని ఓ చెట్టు రకం పేరు)....

Published : 19 May 2022 04:32 IST


విద్యార్థులతో ముచ్చటిస్తున్న కమిషనర్‌ లక్ష్మీశ

సీతంపేట, న్యూస్‌టుడే: ద్వారకానగర్‌లోని విశాఖ పౌర గ్రంథాలయాన్ని జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీశ బుధవారం సందర్శించారు. ఆయన్ను గ్రంథాలయ కార్యదర్శి డి.ఎస్‌.వర్మ అన్ని విభాగాలను చూపించారు. పిల్లల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన ‘మియావాకి(జపాన్‌లోని ఓ చెట్టు రకం పేరు)’ గదిని కమిషనర్‌ ప్రారంభించారు. గ్రంథాలయ నిర్వహణ, ఆధునీకీకరణపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పిల్లలతో కలిసి కాసేపు ముచ్చటించి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. జీవీఎంసీ కమిషనర్‌గా నగరంలో పచ్చదనం పెంపునకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని భారతీయ విద్యా భవన్‌ పాఠశాలకు చెందిన నాలుగో తరగతి విద్యార్థిని ఎల్‌.దృవికా ప్రశ్నించగా.. చెట్ల పెంపకానికి నగరపాలక సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతోందని, ఇందులో భాగంగానే ‘క్లైమేట్‌ స్మార్ట్‌ సిటీస్‌ అసెస్మ్‌ంట్‌ ఫ్రేమ్‌ వర్క్‌ 2.0’లో 4 స్టార్‌ రేటింగ్‌ వచ్చిందని కమిషనర్‌ వివరించారు. చెత్త డంపింగ్‌ పెద్ద సమస్యగా మారింది. దీని నివారణకు ఏదైనా సాంకేతికత వినియోగిస్తున్నారా? అని పదో తరగతి విద్యార్థిని ఎ.సమీక్ష అడగ్గా ప్రజలు చెత్తను రహదారులపై వేయడం జరుగుతోందని, తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలుగా విడదీయకుండా వేయడం వల్ల పారిశుద్ధ్య కార్మికులు ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. చెత్త నిర్వహణపై ప్రజల్లో అవగాహన పెరగాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధ్యక్షుడు డాక్టర్‌ సూరపునేని విజయకుమార్‌, ఆచార్య ఎ.ప్రసన్న కుమార్‌, డాక్టర్‌ డి.వి.సూర్యారావు, లైబ్రేరియన్‌ దుర్గారాణి, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని