logo

హోరు గాలి.. భీకర ఉరుములు!!

అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం అర్ధరాత్రి తరువాత కారుమబ్బులు కమ్ముకొని ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

Published : 26 May 2022 04:58 IST

నేలకూలిన విద్యుత్తు స్తంభాలు.. చెట్లు

అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం అర్ధరాత్రి తరువాత కారుమబ్బులు కమ్ముకొని ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

ఈనాడు, విశాఖపట్నం: భీకర గాలులకు పెద్ద సంఖ్యలో చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. గాజువాక, మరికొన్ని ప్రాంతాల్లోని కాలనీల్లో మురుగు కాలువలు పొంగడంతో ఇళ్లల్లోకి నీరు చేరింది. ఉరుముల భీకర శబ్దాలకు ప్రజలు హడలిపోయారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు విశాఖ జిల్లాలో పలు చోట్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. పరదేశీపాలెంలో 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే వంద మి.మీ.కు మించి మల్కాపురం,  గంగవరం , శ్రీహరిపురాల్లో కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడగా అధికారులు సత్వరం స్పందించి పునరుద్ధరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని