logo

కశింకోట తహసీల్దార్‌ సుధాకర్‌ సస్పెన్షన్‌

కశింకోట తహసీల్దార్‌ బి.సుధాకర్‌ను సస్పెండ్‌ చేస్తూ బుధవారం సంయుక్త కలెక్టర్‌ కల్పనాకుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 02 Feb 2023 05:22 IST

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కశింకోట తహసీల్దార్‌ బి.సుధాకర్‌ను సస్పెండ్‌ చేస్తూ బుధవారం సంయుక్త కలెక్టర్‌ కల్పనాకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పట్టాదారు పాసుపుస్తకాలు, మ్యుటేషన్లు చేయడంలో ఆర్‌ఓఆర్‌ నిబంధనలు పాటించకపోవడం, విధి నిర్వహణలో అలసత్వం వహించడం, అర్హులైన రైతులను ఇబ్బందులకు గురి చేయడం, రీ సర్వే విషయంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయక పోవడం తదితర విషయాలపై విచారణ జరిపి సస్పెండ్‌ చేస్తున్నట్లు జేసీ పేర్కొన్నారు. జిల్లాలో తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేయడంతో రెవెన్యూ వర్గాల్లో అలజడి మొదలైంది. తహసీల్దార్‌ తీరుపై గతంలో పలువురు అర్జీదారులు, రైతులు అసహనం వ్యక్తం చేశారు. మ్యుటేషన్లు చేయడం లేదని పలువురు కలెక్టర్‌ దృష్టికి సైతం తీసుకువచ్చారు. సిబ్బందిని సమన్వయ పరచక పోవడంతోపాటు ప్రభుత్వ భూములు పరిరక్షించడంలో విఫలమయ్యారని తహసీల్దార్‌పై ఆరోపణలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని