logo

చోడవరం సమస్యలపై రాజుకు మొర

‘బాబూ.. కుళాయిల్లో రోజూ తాగునీరు రావడం లేదు. ఇంతకుముందు చెత్తను తరలించేందుకు రోజూ పంచాయతీ బండి వచ్చేది

Published : 29 Mar 2024 04:15 IST

చోడవరం, న్యూస్‌టుడే: ‘బాబూ.. కుళాయిల్లో రోజూ తాగునీరు రావడం లేదు. ఇంతకుముందు చెత్తను తరలించేందుకు రోజూ పంచాయతీ బండి వచ్చేది. ఇప్పుడు రెండు, మూడు రోజులకోసారే వస్తోంది. వీధి రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. పంచాయతీ తీరుతో చాలా ఇబ్బందులు పడుతున్నామ’మంటూ చోడవరం పట్టణ ప్రజలు పలు సమస్యలను కూటమి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు దృష్టికి తీసుకొచ్చారు. తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూనూరు మల్లునాయుడుతో కలిసి కోటవీధి, గండి కాలనీలలో రాజు గురువారం ఎన్నికల ప్రచారం చేశారు. మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. రాజు మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో బీఎన్‌ రోడ్డును గాలికొదిలేసిందన్నారు. గతుకులమయమైన రహదారులతో చోడవరం రూపురేఖలను మార్చేసిందని ఎద్దేవా చేశారు. వచ్చేది కూటమి ప్రభుత్వమేనని, అన్ని రంగాలను గాడిలో పెడతామని భరోసా ఇచ్చారు. ఎంపీటీసీ సభ్యురాలు కొట్టాపు రూప, వార్డు సభ్యుడు సంతోష్‌, తెదేపా, జనసేన నాయకులు పెదబాబు, అచ్చిబాబు, గోవిందు, ఈశ్వరరావు, సోమునాయుడు, డీవీ అప్పారావు, కోటేశ్వరరావు, సరోజని, మూలునాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని