logo

విద్యావంతుల చేతుల్లో రాష్ట్ర భవిత : తెదేపా

ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు విద్యావంతులు, మేధావుల చేతుల్లోనే ఉందనివిశాఖ పార్లమెంట్‌ తెదేపా అభ్యర్థి ఎం.శ్రీభరత్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా అరాచక పాలనకు స్వస్తి పలికి, అభివృద్ధికి బాటలు వేసే తెదేపా కూటమికి ఓటేయాలని కోరారు.

Published : 17 Apr 2024 04:06 IST

గాజువాక, న్యూస్‌టుడే : ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు విద్యావంతులు, మేధావుల చేతుల్లోనే ఉందనివిశాఖ పార్లమెంట్‌ తెదేపా అభ్యర్థి ఎం.శ్రీభరత్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా అరాచక పాలనకు స్వస్తి పలికి, అభివృద్ధికి బాటలు వేసే తెదేపా కూటమికి ఓటేయాలని కోరారు. మంగళవారం గాజువాక కల్చరల్‌ క్లబ్‌లో పట్టణ ప్రముఖులు, విద్యావంతులు, మేధావులు, వ్యాపారులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు కేంద్రాన్ని ఒప్పించేలా కృషి చేస్తానన్నారు.  విశాఖను గంజాయి విక్రయాలకు, భూకబ్జాలకు చిరునామాగా మార్చిన వైకాపాకు ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ... కూటమి అధికారంలోకి రాగానే గాజువాకలో మౌలిక సదుపాయాల కల్పనకు తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు.భాజపా, జనసేన నాయకులు నర్సింగరావు, అప్పారావు మాట్లాడారు.


కాపులంతా కూటమి వైపే నిలవాలి

సీతంపేట, న్యూస్‌టుడే : కాపులంతా కూటమి వైపు నిలబడాలని కాపు జేఏసీ సభ్యులు ఆరేటి ప్రకాష్‌, కాపు ఉద్యమ నేత ఆకుల రామకృష్ణ కోరారు. విశాఖ పౌరగ్రంథాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కాపులను వైకాపా ప్రభుత్వం వంచించిందన్నారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ అయిదు శాతాన్ని అమలు చేయకపోవడం వల్ల కాపు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఒక్క కాపు సబ్సిడీ రుణం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. జగన్‌ కాపులకు తీరని అన్యాయం చేశారన్నారు. వైకాపా ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయాయని ఆరోపించారు. రాష్ట్రం బాగుపడాలంటే దూరదృష్టి ఉన్న చంద్రబాబునాయుడు వల్లే సాధ్యమని చెప్పారు. కార్యక్రమంలో తుమ్మల సత్యరావు, ప్రగడ చిన నాగేశ్వరరావు, కర్రి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


గంటా సతీమణి, కుమార్తె ప్రచారం

తగరపువలస, న్యూస్‌టుడే: తెదేపా అభ్యర్థి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు మద్దతుగా ఆయన భార్య శారద, కుమార్తె పూజిత భీమిలిలోని ఆపార్టీ కార్యాలయం పరిసరాల్లో మంగళవారం ప్రచారం నిర్వహించారు. సైకిల్‌ గుర్తుపై ఓటేసి గంటాను గెలిపించాలని కోరారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శారద తెలుగు మహిళలతో కొద్దిసేపు మాట్లాడారు. మహిళల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేసింది తెలుగుదేశం పార్టీయేనని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళలు, వీర మహిళలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు