logo

మీ కష్టం ఉంచుకోను.. తగు రీతిలో చూసుకుంటా

‘డియర్‌ వాలంటీర్స్‌.. మీ అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి. చంద్రబాబు మీపై చేసిన ఫిర్యాదు మేరకు రాజీనామా చేసి పంచాయతీ కార్యదర్శులకు అందజేయండి.

Published : 18 Apr 2024 04:39 IST

గ్రామ వాలంటీర్లకు విప్‌ ధర్మశ్రీ ఆడియో సందేశం

చోడవరం, న్యూస్‌టుడే: ‘డియర్‌ వాలంటీర్స్‌.. మీ అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి. చంద్రబాబు మీపై చేసిన ఫిర్యాదు మేరకు రాజీనామా చేసి పంచాయతీ కార్యదర్శులకు అందజేయండి. నెల రోజుల్లో మళ్లీ మనమే అధికారంలోకి వస్తున్నాం. ఆయనే (సీఎం జగన్‌) మిమ్మల్ని రీఇన్‌స్టిట్యూట్‌ చేస్తారు. మీరంతా జాప్యం చేయకుండా ముఖ్యమంత్రికి మద్దతుగా రాజీనామా చేయండి. ఏ ఇళ్లకు మీరు వెళ్లి సేవలు అందించారో.. అవే ఇళ్లకు వెళ్లి ఎన్నికల్లో నాకు ఓటేయించండి. మీ కష్టానికి తగు రీతిలో చూసుకుంటా. దయచేసి సహకరించండి. ఈ రోజే రాజీనామా చేసేయండి. ఫ్లీజ్‌..’ అంటూ విప్‌ కరణం ధర్మశ్రీ గ్రామ వాలంటీర్లకు బుధవారం ఆడియో సందేశం పంపారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఎన్నికల ప్రచారంలో తెదేపా అధినేత చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నెలకు రూ.పది వేల చొప్పున వేతనం ఇస్తామని ప్రకటించడంతో గ్రామ వాలంటీర్లలో పునరాలోచన మొదలైంది. చాలామంది రాజీనామా చేసేందుకు వెనకడుగు వేశారు. దీంతో వైకాపా నాయకులో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో విప్‌ ధర్మశ్రీ గ్రామ వాలంటీర్ల సెల్‌ఫోన్లకు ఆడియో సందేశం పంపడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని