logo

మహిళలకు భద్రత కల్పించడంలో దేశానికే ఆదర్శం

ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడంతో పాటు వారికి భద్రత కల్పించడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. పోలీసు శాఖ

Published : 21 May 2022 01:50 IST

మహబూబాబాద్‌లో భరోసా కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి సత్యవతిరాథోడ్‌,

చిత్రంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ రవీందర్‌రావు, ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్‌

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడంతో పాటు వారికి భద్రత కల్పించడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘భరోసా’ కేంద్రాన్ని శుక్రవారం ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ రవీందర్‌రావు, ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్‌తో కలిసి ప్రారంభించారు. కేంద్రంలో అందించే సేవలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహిళల రక్షణ కోసం ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా అనేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారన్నారు. సఖి, షీం టీంల ఏర్పాటు ద్వారా మహిళలకు ధైర్యం వచ్చిందన్నారు. అత్యాచారానికి గురైన బాధితులకు అండగా వారికి న్యాయం జరిగే విధంగా కృషి చేసేందుకు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. కలెక్టర్‌ కె.శశాంక, జిల్లా ఎస్పీ శరత్‌చంద్రపవార్‌, ఏఎస్పీ యోగేష్‌గౌతమ్‌, జిల్లా సంక్షేమ శాఖాధికారి స్వర్ణలతలెనీనా, సీడబ్ల్యూసీ అధ్యక్షురాలు డాక్టర్‌ ఎస్‌.నాగవాణి, కేంద్రం నిర్వాహకులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని