logo

‘తులం బంగారం ఇచ్చి ఉంటే కాంగ్రెస్‌కు ఓటేయండి’

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్‌ ప్రభుత్వం పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చి ఉంటే ఆ పార్టీకే ఓటేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ సూచించారు.

Published : 17 Apr 2024 04:48 IST

మాట్లాడుతున్న మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌

ఇల్లెందు, న్యూస్‌టుడే: ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్‌ ప్రభుత్వం పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చి ఉంటే ఆ పార్టీకే ఓటేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ సూచించారు. అలాకాకుంటే కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేసిన భారాసకు పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం మినహా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. భారాస ఇల్లెందు పట్టణ, మండల, టేకులపల్లి, కామేపల్లి మండలాల ప్రజాప్రతినిధులు, ప్రధాన నాయకులతో స్థానిక పాత బస్టాండ్‌లోని ఐతవారి భవనంలో మంగళవారం పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు.  రాజకీయ కుట్రల నేపథ్యంలో కేంద్రం ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేశారని, త్వరలో ఆమె నిర్దోషిగా బయటకు వస్తారన్నారు. ఎంపీగా వందసార్లు మాలోత్‌ కవిత ఇల్లెందుకు వచ్చి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారన్నారు. మరోసారి ఆమెను గెలిపించాలని కోరారు. భారాస ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో మొదట గెలిచే ఎంపీ స్థానం తనదేనన్నారు. ఎన్నికల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌, ఎమ్మెల్సీ రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, జడ్పీ ఛైర్మన్‌ ఆంగోతు బిందు, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు రాజేందర్‌, నాయకులు పి.వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, రమేష్‌, ఆజాం, కృష్ణప్రసాద్‌, తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు