logo

‘కడియం చేసిన ద్రోహం చరిత్రలో నిలుస్తుంది’

ఆదరించి ఎన్నో అవకాశాలు కల్పించిన భారాసకు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన ద్రోహం చరిత్రలో నిలిచిపోతుందని ఆ పార్టీ వరంగల్‌ లోక్‌సభ అభ్యర్థి డాక్టర్‌ మారేపల్లి సుధీర్‌కుమార్‌ అన్నారు.

Published : 17 Apr 2024 04:51 IST

మాట్లాడుతున్న మాజీ మంత్రి దయాకర్‌రావు, చిత్రంలో భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్‌కుమార్‌, తదితరులు

దేవరుప్పుల రూరల్‌, న్యూస్‌టుడే: ఆదరించి ఎన్నో అవకాశాలు కల్పించిన భారాసకు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన ద్రోహం చరిత్రలో నిలిచిపోతుందని ఆ పార్టీ వరంగల్‌ లోక్‌సభ అభ్యర్థి డాక్టర్‌ మారేపల్లి సుధీర్‌కుమార్‌ అన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన మంగళవారం దేవరుప్పులలోని ఓ వేడుకల మందిరంలో నిర్వహించిన మండల నాయకుల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడడం తగదన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచిన దయాకర్‌రావు వ్యక్తిత్వం ప్రతి రాజకీయ నాయకుడికి ఆదర్శమన్నారు. అవకాశం ఇచ్చి ఎంపీగా గెలిపిస్తే ఇక్కడి సమస్యలపై పార్లమెంటులో పోరాడుతానన్నారు. అనంతరం దయాకర్‌రావు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగుసార్లు ఓడిన కడియంకి తనను విమర్శించే హక్కు లేదని విమర్శించారు. సుధీర్‌కుమార్‌ నీతి, నిజాయతీ కలిగిన వ్యక్తిత్వంతో పాటు తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలకంగా పనిచేశారన్నారు. ప్రజల్లో భాజపాకు క్యాడర్‌ లేదని, కాంగ్రెస్‌ పార్టీ విశ్వాసం కోల్పోయిందని విమర్శించారు. కేసీఆర్‌ మీద అభిమానం, కడియం శ్రీహరిపై పెరిగిన కోపం తమ గెలుపునకు దోహదపడుతాయని తెలిపారు. భారాస అభ్యర్థి గెలుపునకు పాటుపడాలని కార్యకర్తలను కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ బస్వ సావిత్రి, పార్టీ మండలాధ్యక్షుడు తీగల దయాకర్‌, జిల్లా యువజన నాయకులు సుందర్‌రాంరెడ్డి, ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి చింత రవి, బస్వ మల్లేశం, నరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు