logo

కోట్లు పోసి ఏం లాభం..?

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కొల్లేరులో రూ.6 కోట్లు వెచ్చించి నిర్మించిన రిసార్టు నిరుపయోగంగా మారింది. పర్యాటకంగా తీర్చిదిద్దాలని, కొల్లేరు అందాలు తిలకించేందుకు వచ్చే పర్యాటకులకు వసతి సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో ఎనిమిదేళ్ల కిందట ఏలూరు మండలం గుడివాకలంకలో దీనిని నిర్మించారు.

Published : 24 Sep 2022 06:00 IST

కొల్లేరు రిసార్టు నిరుపయోగం

గుడివాకలంక రిసార్టు ప్రాంగణంలో పందుల గుంపు

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కొల్లేరులో రూ.6 కోట్లు వెచ్చించి నిర్మించిన రిసార్టు నిరుపయోగంగా మారింది. పర్యాటకంగా తీర్చిదిద్దాలని, కొల్లేరు అందాలు తిలకించేందుకు వచ్చే పర్యాటకులకు వసతి సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో ఎనిమిదేళ్ల కిందట ఏలూరు మండలం గుడివాకలంకలో దీనిని నిర్మించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కొన్నాళ్లు నిర్వహించారు. సందర్శకులు రాకపోవడంతో నిర్వహణ భారంగా మారింది. అనంతరం ఓ గుత్తేదారుకు లీజుకిచ్చారు. నిర్వహణ భారంగా మారి నష్టాలు రావడంతో అతను లీజు ఉపసంహరించుకున్నారు. అప్పటి నుంచి పర్యవేక్షణ లేనందున రిసార్టు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. మద్యం ప్రియులు, జూదరులు, జంటలకు ఆవాసమైంది. కాగా, కొందరు పందుల పెంపక కేంద్రంగా మార్చేశారు. కొల్లేరు పరిరక్షణ విధులు నిర్వహిస్తున్న వన్యప్రాణి అధికారులు, సిబ్బంది ఈ వ్యవహారం తమది కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

సీఆర్‌జడ్‌ భూములపై ఆరా
మొగల్తూరు, న్యూస్‌టుడే: మండలంలోని పేరుపాలెంసౌత్‌, కేపీపాలెంసౌత్‌లోని తీర ప్రాంతాన్ని కలెక్టర్‌ పి.ప్రశాంతి శుక్రవారం సందర్శించారు. ఆయా గ్రామాల్లోని సీఆర్‌జడ్‌ భూముల వివరాలను తహశీల్దారు జి.అనితాకుమారిని అడిగి తెలుసుకున్నారు.సుమారు 350 ఎకరాలకు సంబంధించిన వివరాలపై కలెక్టర్‌ ఆరా తీశారు. సబ్‌కలెక్టర్‌ సి.విష్ణుచరణ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని