logo

కూటమి ప్రభుత్వంతో ప్రగతి పథం

జగన్‌లా హామీలు ఇచ్చి మడమ తిప్పడం తనకు చేతకాదని.. పల్లెల్లో తాగునీరు ఇతర సమస్యలను ప్రణాళిక ప్రకారం పరిష్కరించేలా కృషిచేస్తానని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

Published : 25 Apr 2024 06:07 IST

సమస్యల పరిష్కారానికి ప్రణాళిక: కనుమూరి

కలిగొట్ల: ప్రచారంలో తెదేపా అభ్యర్థి రఘురామ, రామరాజు

ఉండి, న్యూస్‌టుడే: జగన్‌లా హామీలు ఇచ్చి మడమ తిప్పడం తనకు చేతకాదని.. పల్లెల్లో తాగునీరు ఇతర సమస్యలను ప్రణాళిక ప్రకారం పరిష్కరించేలా కృషిచేస్తానని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.ఆరేడు, కలిగొట్ల, ఉప్పులూరు గ్రామాల్లో బుధవారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ఎమ్మెల్యే రామరాజుతో కలిసి మాట్లాడారు. రామరాజుకు ప్రజా సమస్యలన్నీ తెలుసని.. ఆయన ఇచ్చిన హామీలన్నీ తాను నెరవేరుస్తానని తెలిపారు. గ్రామస్థులంతా కలిసి కలిగొట్లలో వంతెన నిర్మించుకోవడం ప్రశంసనీయమన్నారు. ఇదే ఐక్యతతో తెదేపా, జనసేన, భాజపా కూటమిని గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. రామరాజు మాట్లాడుతూ కలిగొట్ల ఎప్పుడూ తెదేపాకు కంచుకోట అన్నారు. రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీ అందించాలని కోరారు. పార్టీ గ్రామ అధ్యక్షుడు రుద్రరాజు యువరాజు అధ్యక్షతన జరిగిన సభలో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి జుత్తిగ నాగరాజు, సర్పంచి మాదిరెడ్డి సూర్య సత్యనారాయణ, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు, ఐతెదేపా రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి యశోద కృష్ణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి జుత్తిగ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

గొల్లలకోడేరు (పాలకోడేరు), ఆకివీడు, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వ అక్రమాలు, అన్యాయాలపై నాలుగేళ్లుగా యుద్ధం చేస్తున్న రఘురామకృష్ణరాజును గెలిపించి ప్రజాస్వామ్యన్ని కాపాడాలని ఆయన సతీమణి రమాదేవి విజ్ఞప్తి చేశారు. గొల్లలకోడేరులో తెదేపా, జనసేన, భాజపా శ్రేణులతో కలిసి ఆమె బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేసిన తన భర్తను జగన్‌రెడ్డి అనేక ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా మండల అధ్యక్షుడు కోటేశ్వరరాజు, నాయకులు కామన రాంబాబు, కమ్మిల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

  • ఆకివీడులో రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్‌ ఎన్నికల ప్రచారం చేశారు. తొలుత తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలతో కలిసి ద్విచక్ర వాహన ప్రదర్శన నిర్వహించారు. నాయకులు మోటుపల్లి రామవరప్రసాద్‌, బొల్లా వెంకట్రావు, పిల్లా నరసింహరాజు (బాబులు), గొంట్ల గణపతి, గంధం ఉమా తదితరులు పాల్గొన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు