logo

పిల్లలతో వైకాపా ప్రచారం

కడప నగరంలోని ఒకటో డివిజన్‌లో మంగళవారం వైకాపా నాయకులు పాఠశాల విద్యార్థులతో ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం పిల్లలను ఎన్నికల ప్రచారానికి వినియోగించడం, ర్యాలీల్లో పాల్గొనేలా చేయడం నిషేధం.

Published : 17 Apr 2024 05:31 IST

కడపలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిహాసం

ఒకటో డివిజన్‌లో పిల్లలతో ప్రచారం చేయిస్తున్న వైకాపా నాయకులు

కడప నగరంలోని ఒకటో డివిజన్‌లో మంగళవారం వైకాపా నాయకులు పాఠశాల విద్యార్థులతో ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం పిల్లలను ఎన్నికల ప్రచారానికి వినియోగించడం, ర్యాలీల్లో పాల్గొనేలా చేయడం నిషేధం. జిల్లా కేంద్రంలో కడప మేయర్‌ సురేష్‌బాబు, వైకాపా నాయకులు, పిల్లల మెడలో పార్టీ కండువాలు వేసి, టోపీలు పెట్టి జగన్‌ చిత్రపటాలతో ప్రదర్శన నిర్వహించడం గమనార్హం. దీనిపై ఎన్నికల సంఘం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి..

న్యూస్‌టుడే, కడప నగరపాలక సంస్థ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని