logo

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

ఒంటిమిట్ట కోదండరామాలయంలో మంగళవారం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. తితిదే ఉప కార్యనిర్వహణాధికారి పి.వి.నటేష్‌బాబు పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ పూజలు నిర్వహించారు.

Published : 17 Apr 2024 05:54 IST

రంగ మండపంలో అంకురార్పణ పూజలు నిర్వహిస్తున్న తితిదే ఆగమ సలహాదారు రాజేష్‌ భట్టార్‌, అర్చకులు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట కోదండరామాలయంలో మంగళవారం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. తితిదే ఉప కార్యనిర్వహణాధికారి పి.వి.నటేష్‌బాబు పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ పూజలు నిర్వహించారు. ఉత్సవాల నిర్వాహకుడు కల్యాణపురం రాజేష్‌ భట్టార్‌ను సంప్రదాయబద్ధంగా, ఆలయ మర్యాదలతో రామయ్య క్షేత్రానికి తీసుకొచ్చారు. గర్భాలయంలో సీతారామలక్ష్మణమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి ఉత్సవాలకు అంకురార్పణకు శ్రీకారం చుట్టారు. రాజేష్‌ భట్టార్‌ కంకణం ధరించి గణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన, భగవత్‌ సంకల్పం, రక్షాబంధనం, పుట్ట మన్ను సేకరణ, అంకురార్పణ, గరుడ ప్రతిష్ఠ, హోమం వేడుకగా జరిపారు. ఉత్సవాల సందర్భంగా పురుషోత్తముడి సన్నిధిలో భక్తుల కోలాహలంతో సందడి నెలకొంది. ఆలయ ప్రాకారం, ఆవరణ, మాడవీధులు, కాలిబాటలు విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలకంరించారు. కేరళ సింగారి వాయిద్యం కళాకారులు తమ ప్రదర్శనలతో హోరెత్తించారు.కార్యక్రమంలో ప్రత్యేకాధికారిణి ప్రశాంతి, పర్యవేక్షకుడు హనుమంతయ్య, తనిఖీ అధికారి నవీన్‌కుమార్‌, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని