logo

దాశరథి...శేష వాహన విహారి

శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో తొలిరోజు బుధవారం రాత్రి సీతారాములు ప్రత్యేక అలంకరణలో శేష వాహనంపై భక్తులకు దర్శన మిచ్చారు.

Published : 18 Apr 2024 04:17 IST

న్యూస్‌టుడే, ఒంటిమిట్ట: శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో తొలిరోజు బుధవారం రాత్రి సీతారాములు ప్రత్యేక అలంకరణలో శేష వాహనంపై భక్తులకు దర్శన మిచ్చారు. సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. గ్రామోత్సవం ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది. ఒంటిమిట్ట పుర వీధుల్లో పండగ వాతావరణం నెలకొంది. దారి పొడవునా తాళ భజనలు, కోలాట నృత్య ప్రదర్శనలు, సన్నాయి మేళాలు, కేరళ కళాకారుల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని