logo

రాయంచపై రాములోరి రాజసం

ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు గురువారం రాత్రి రాయంచపై రాములోరి విహారం కనులపండువగా సాగింది.

Published : 19 Apr 2024 03:19 IST

హంస వాహనంపై విహరిస్తున్న  సీతారామలక్ష్మణమూర్తులు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు గురువారం రాత్రి రాయంచపై రాములోరి విహారం కనులపండువగా సాగింది. సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో సుందరంగా ముస్తాబు చేశారు. ఉప కార్యనిర్వహణాధికారి నటేష్‌బాబు, తితిదే డీఎఫ్‌వో శ్రీనివాసులు ఆధ్వర్యంలో హంస వాహన సేవ ఉత్సవాన్ని ఒంటిమిట్ట పురవీధుల్లో రమణీయంగా నిర్వహించారు. కళాకారుల కోలాట నృత్య ప్రదర్శనలు, తాళభజనలు, డప్పుల వాయిద్యాల నడుమ గ్రామోత్సవం నేత్రపర్వంగా సాగింది. అధిక సంఖË్యలో భక్తులు తరలివచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని