logo

ఓటరుగా పేరు నమోదు చేసుకోండి: కలెక్టర్‌

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలని పాలనాధికారిణి నిఖిల తెలిపారు. మంగళవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులు, కార్యాలయం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.

Published : 26 Jan 2022 01:22 IST


ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్‌ నిఖిల, ఇతర అధికారులు

వికారాబాద్‌ మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలని పాలనాధికారిణి నిఖిల తెలిపారు. మంగళవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులు, కార్యాలయం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా అర్హతను సాధిస్తారని తప్పకుండా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. మీ పరిసర ప్రాంతాల్లో నివసించే యువతీ, యువకులను తమ పేరు ఓటరు జాబితాలో ఉండేలా వారికి అవగాహన కల్పించాలని కోరారు. మొబైల్‌ యాప్‌, ఆన్‌లైన్‌ ద్వారా ఓటరు సేవలు వినియోగించుకోవాలని కోరారు. ఓటు విలువ తెలిపేందుకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు పాలనాధికారి మోతీలాల్‌, స్వీప్‌ నోడల్‌ అధికారి కోటాజీ, పరిపాలనాధికారిణి హరిత, ఎన్నికల పర్యవేక్షకుడు శ్రీధర్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

లక్ష్యం మేరకు నర్సరీల్లో మొక్కలు పెంచాలి

బొంరాస్‌పేట: హరిత హారంలో భాగంగా వర్షా కాలం తర్వాత గ్రామాల్లో నాటేందుకు నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉండాలని జిల్లా పాలనాధికారి నిఖిల అన్నారు. మంగళవారం బొంరాస్‌పేట మండలంలోని చౌదర్‌పల్లిలో పర్యటిస్తూ పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌ యార్డు, నర్సరీలను పరిశీలించారు. హరిత హారంలో మొక్కలు నాటేందుకు పెంచుతున్న నర్సరీల్లో ఇప్పటి వరకు మొలకలు లేకపోవటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో నర్సరీల్లో మొక్కలు పెరుగుతున్నట్లు కనిపించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమిబాయి, వైస్‌ ఎంపీపీ నారాయణరెడ్డి, డీఆర్‌డీఓ కృష్ణన్‌, డీపీఓ మాల్లారెడ్డి, ఎంపీడీఓ పాండు, తహసీల్దారు షాహెదాబేగం తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని