logo

ఆసుపత్రి పనితీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ ధర్నా

పరిగిలోని సామాజిక ఆసుపత్రి పనితీరు మెరుగు పరచాలని సోమవారం కాంగ్రెస్‌ నాయకులు ధర్నా చేశారు.   వైద్యులు ఉన్నా విధులకు డుమ్మా కొడుతున్నారని దీంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా

Published : 24 May 2022 00:46 IST

జిల్లా వైద్యాధికారి తుకారంతో వాగ్వాదానికి దిగిన కాంగ్రెస్‌ నాయకులు

పరిగి, న్యూస్‌టుడే: పరిగిలోని సామాజిక ఆసుపత్రి పనితీరు మెరుగు పరచాలని సోమవారం కాంగ్రెస్‌ నాయకులు ధర్నా చేశారు.   వైద్యులు ఉన్నా విధులకు డుమ్మా కొడుతున్నారని దీంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ఎందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదని పరిశీలన నిమిత్తం పరిగికి వచ్చిన జిల్లా వైద్యాధికారి తుకారంభట్‌ను నిలదీశారు. జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు లాల్‌క్రిష్ణప్రసాద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు, మండల, పట్టణాధ్యక్షుడు పరశురాంరెడ్డి, క్రిష్ణ మాట్లాడుతూ వైద్యం సక్రమంగా అందక పేదలు ఆసుపత్రికి రావడం మానేస్తున్నారని తెలిపారు. వైద్యులు, స్టాఫ్‌ నర్సులు ఉన్నా అటెండర్లు వైద్యం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మల్లేష్‌, రియాజ్‌, నాగవర్ధన్‌, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

విధులనుంచి తొలగింపు  
- వైద్యాధికారి తుకారాంభట్‌

ఆదివారం డుమ్మా కొట్టిన వైైద్యాధికారిని వైద్య విధాన పరిషత్‌ అధికారులు విధుల నుంచి తొలగించినట్లు జిల్లా వైద్యాధికారి తుకారంభట్‌  పేర్కొన్నారు. ఆసుపత్రి ఇంఛార్జి సూపరింటెండెంట్‌గా కొనసాగుతున్న సత్యనారాయణ షిండేను తప్పించి సీనియర్‌ వైద్యాధికారిగా ఉన్న లలితకు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు తెలిపారు. మరో వైద్యాధికారి ప్రవీణ్‌ను మద్గుల్‌ చిట్టెంపల్లికి పంపుతున్నట్లు వివరించారు. స్థానికంగా నెలకొన్న సమస్యను పాలనాధికారిణి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. త్వరలోనే స్టాఫ్‌ నర్సుల పోస్టులను కూడా భర్తీ చేస్తామని ఆసుపత్రి నిర్వహణను చక్కదిద్దుతామని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని