icon icon icon
icon icon icon

Andhra news: ఏపీలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా ప్రకటించిన ఈసీ

ఏపీ సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. 

Published : 30 Apr 2024 23:11 IST

 

అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత లోక్‌సభ బరిలో 454 మంది అభ్యర్థులు ఉన్నారు. నంద్యాలలో 31, గుంటూరులో 30 మంది పోటీలో ఉన్నారు. కడప లోక్‌సభకు షర్మిల సహా 14 మంది బరిలో నిలిచారు.  

ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 318 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 46 మంది పోటీలో ఉండగా.. అనకాపల్లి జిల్లా చోడవరం అసెంబ్లీ నుంచి అత్యల్పంగా ఆరుగురు పోటీలో ఉన్నారు. మంగళగిరిలో నారా లోకేశ్‌ సహా 40 మంది బరిలో ఉన్నారు. కుప్పం నుంచి చంద్రబాబు సహా 13 మంది,  పిఠాపురం అసెంబ్లీ బరిలో పవన్‌ సహా 13 మంది పోటీ చేస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలో జగన్‌ సహా 27 మంది పోటీలో ఉన్నారని ఎన్నికల సంఘం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img