icon icon icon
icon icon icon

ఏపీలో సంక్షేమ పథకాలకు నిధుల జమ ఎందుకు ఆలస్యమైంది?: ఈసీ

ఏపీలో సంక్షేమ పథకాల నగదు జమపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల పోలింగ్‌ ముగిసేవరకు నిధుల జమను వాయిదా వేసింది.

Updated : 09 May 2024 13:49 IST

అమరావతి: ఏపీలో సంక్షేమ పథకాల నగదు జమపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. పోలింగ్‌ ముగిసేవరకు నిధుల జమను వాయిదా వేసింది. ఎన్నికల కోడ్‌కు ముందే వివిధ పథకాల కోసం సీఎం జగన్‌ బటన్‌ నొక్కారు. ఎన్నికల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో సుమారు రూ.14,165 కోట్లు జమ అయ్యేలా వైకాపా ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. దీనికి ఈసీ అభ్యంతరం తెలిపింది.

‘‘నిధుల జమ ఎందుకు ఆలస్యమైందో ప్రభుత్వం చెప్పాలి. డీబీటీతో వెంటనే నగదు లబ్ధిదారుల ఖాతాలకు చేరుతున్నా ఎందుకు ఆలస్యమైంది?ప్రచారం ముగిశాక జమ చేసే యత్నం జరుగుతోంది. పోలింగ్‌కు 2 రోజుల ముందువేస్తే కోడ్‌ ఉల్లంఘనే అవుతుంది’’ అని ఈసీ పేర్కొంది. ఎన్నికలు పూర్తయ్యాకే ఆ నిధులను జమ చేయాలని.. మే 13న పోలింగ్‌ ముగిసిన తర్వాత దీనిపై మార్గదర్శకాలు ఇస్తామని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img