icon icon icon
icon icon icon

DIG Ammireddy: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై బదిలీ వేటు

అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.

Updated : 06 May 2024 18:26 IST

అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని పలువురు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు కొనసాగుతోంది. ఇటీవల ఎస్పీ అన్బురాజన్‌ను బదిలీ చేసిన ఈసీ.. తాజాగా అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై వేటు వేసింది. తక్షణమే విధుల నుంచి రిలీవ్‌ కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఎన్నికల బాధ్యతలు అప్పగించొద్దని ఉన్నతాధికారులను ఆదేశించింది. వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

వైకాపాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అన్బురాజన్‌ను ఈసీ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో అమిత్‌ బర్దర్‌ను నియమించింది. మరోవైపు అనంతపురం అర్బన్‌ డీఎస్పీగా టి.వి.వి ప్రతాప్‌ కుమార్‌ను, రాయచోటి డీఎస్పీగా రామచంద్రరావును నియమిస్తూ ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img