icon icon icon
icon icon icon

అనపర్తి కూటమి అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా తెదేపా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బరిలో ఉండనున్నారు.

Published : 22 Apr 2024 05:13 IST

నల్లమిల్లితో భేటీ అనంతరం భాజపా నేత సర్వారాయుడు వెల్లడి

ఈనాడు డిజిటల్‌, అమరావతి, రాజమహేంద్రవరం, అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా తెదేపా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బరిలో ఉండనున్నారు. భాజపాలో చేరి కమలం గుర్తుపై పోటీ చేయడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోన్‌ చేసి భాజపాలోకి ఆహ్వానించినట్లు నల్లమిల్లి నిర్ధారించారు. రాజమహేంద్రవరానికి చెందిన భాజపా నాయకుడు కంటిపూడి సర్వారాయుడు రామవరంలో నల్లమిల్లితో సమావేశమై నియోజకవర్గ పరిస్థితులపై చర్చించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ కూటమి అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి పోటీ చేస్తారని, ఆయన విజయానికి అంతా కృషి చేస్తామని తెలిపారు. ఏ గుర్తుపై బరిలో ఉంటారని ప్రశ్నించగా కూటమి గుర్తుపైనేనని తెలిపారు. అనంతరం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 20 రోజులుగా నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై పార్టీ అధినేత చంద్రబాబుకు వివరించానని, ఆయన నిర్ణయమే శిరోధార్యమని స్పష్టం చేశారు. కూటమి పెద్దలతో చర్చించి ప్రకటిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారన్నారు.

23న నామినేషన్‌: అనపర్తికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి ఏ పార్టీ నుంచి బరిలో ఉంటారనే అంశంపై సోమ లేదా మంగళవారం అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 23న నామినేషన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img