icon icon icon
icon icon icon

అరకొర సమాచారంతో బుగ్గన అఫిడవిట్‌

నంద్యాల జిల్లా డోన్‌ వైకాపా అభ్యర్థి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సోమవారం సమర్పించిన అఫిడవిట్‌లో పూర్తి వివరాలు ఆన్‌లైన్లో కన్పించడం లేదు. అఫిడవిట్‌ పత్రంలో సమగ్ర సమాచారం ఇవ్వకుండా, ఆ వివరాల్ని అనుబంధ పత్రాల్లో (అనెగ్జర్లలో) పేర్కొన్నట్లు వెల్లడించారు.

Updated : 23 Apr 2024 05:49 IST

మొత్తం ఆస్తుల విలువ రూ.41.48 కోట్లు

ఈనాడు, కర్నూలు: నంద్యాల జిల్లా డోన్‌ వైకాపా అభ్యర్థి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సోమవారం సమర్పించిన అఫిడవిట్‌లో పూర్తి వివరాలు ఆన్‌లైన్లో కన్పించడం లేదు. అఫిడవిట్‌ పత్రంలో సమగ్ర సమాచారం ఇవ్వకుండా, ఆ వివరాల్ని అనుబంధ పత్రాల్లో (అనెగ్జర్లలో) పేర్కొన్నట్లు వెల్లడించారు. ఎన్నికల కమిషన్‌కు చెందిన ‘క్యాండిడేట్‌ అఫిడవిట్‌ మేనేజ్‌మెంట్‌’ వెబ్‌సైట్‌లో అఫిడవిట్‌ పత్రం మాత్రమే అప్‌లోడ్‌ చేశారు. అనెగ్జర్లు అప్‌లోడ్‌ చేయకపోవడంతో సమగ్ర వివరాలు తెలియడం లేదు. మొత్తంగా రూ.41.48 కోట్లు ఉన్నట్లు లెక్క చూపించారు. డిపాజిట్లు తన పేరిట రూ.3.15 కోట్లు, తనపై ఆధారపడిన వ్యక్తి పేరిట రూ.32.69 లక్షలు ఉన్నట్లు చూపారు. పెట్టుబడులు, షేర్లు, డిబెంచర్లు, మ్యూచువల్‌ ఫండ్లు, ఎన్‌ఎస్‌ఎస్‌ బాండ్లు, పోస్టల్‌ సేవింగ్స్‌ ఖాతా, బీమా పాలసీలు, వాహనాలు తదితరాలేవీ అఫిడవిట్‌లో లేవు. వాహనాల విలువ రూ.62.57 లక్షలుగా చూపారు. తన పేరిట రూ.26 లక్షలు, భార్య పేరిట రూ.19.50 లక్షలు, కుటుంబ సభ్యుల పేరుతో రూ.8.75 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లు చూపించారు. తన పేరిట రూ.7.17 కోట్లు, భార్య పేరిట రూ.93.29 కోట్లు, హిందూ అవిభాజ్య కుటంబం కింద రూ.7.49 కోట్ల స్థిరాస్తులను చూపించారు. స్థిరాస్తుల్లో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, భవనాల విలువను విడివిడిగా ప్రస్తావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img