icon icon icon
icon icon icon

విశాఖలో ఎన్డీయే భారీ ర్యాలీ.. తెదేపా ఎంపీ అభ్యర్థిగా శ్రీభరత్‌ నామినేషన్‌

విశాఖపట్నం లోక్‌సభ స్థానానికి తెదేపా అభ్యర్థిగా ఎం.శ్రీభరత్‌ సోమవారం నామినేషన్‌ వేశారు. భార్య తేజస్విని, ఎన్డీయే పార్టీల నేతలు, శ్రేణులతో భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు వచ్చి, రిటర్నింగ్‌ అధికారి మల్లికార్జునకు నామపత్రాలు అందజేశారు.

Published : 23 Apr 2024 05:58 IST

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: విశాఖపట్నం లోక్‌సభ స్థానానికి తెదేపా అభ్యర్థిగా ఎం.శ్రీభరత్‌ సోమవారం నామినేషన్‌ వేశారు. భార్య తేజస్విని, ఎన్డీయే పార్టీల నేతలు, శ్రేణులతో భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు వచ్చి, రిటర్నింగ్‌ అధికారి మల్లికార్జునకు నామపత్రాలు అందజేశారు. విశాఖ లోక్‌సభ తెదేపా అధ్యక్షుడు గండి బాబ్జీ, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, అసెంబ్లీ స్థానాల ఎన్డీయే అభ్యర్థులు వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు, వంశీకృష్ణ శ్రీనివాస్‌, పల్లా శ్రీనివాసరావు, గణబాబు, న్యాయవాది సుమన్‌ ఆయన వెంటున్నారు. విశాఖ తూర్పు, ఉత్తరం, దక్షిణ నియోజకవర్గాల మీదుగా ర్యాలీ సాగింది. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, విశాఖలోని భూములను తాకట్టుపెట్టి ఇతర చోట్ల ఖర్చు చేశారని శ్రీభరత్‌ దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img