icon icon icon
icon icon icon

నేడు పవన్‌ కల్యాణ్‌ నామినేషన్‌

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి కూటమి అభ్యర్థిగా మంగళవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలులోని నివాసం నుంచి ఉదయం 9.30 గంటలకు ఆయన ర్యాలీగా బయలుదేరి, పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకూ ర్యాలీగా వెళతారు.

Updated : 23 Apr 2024 06:58 IST

పిఠాపురం, గొల్లప్రోలు, న్యూస్‌టుడే: జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి కూటమి అభ్యర్థిగా మంగళవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలులోని నివాసం నుంచి ఉదయం 9.30 గంటలకు ఆయన ర్యాలీగా బయలుదేరి, పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకూ ర్యాలీగా వెళతారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో మండల పరిషత్‌ కార్యాలయానికి చేరుకుని నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. తన విజయం కోసం ఒంటిపూట భోజనంతో పిఠాపురం నియోజకవర్గంలో సైకిల్‌పై తిరుగుతూ ప్రచారం చేస్తున్న వీరాభిమాని మామిడి బాబ్జీని పవన్‌ కల్యాణ్‌ అభినందించారు. బాబ్జీ సైకిల్‌ను తానూ కొంతదూరం తొక్కి అభిమానులను ఉత్సాహపరిచారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేయాలని రాష్ట్ర దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఉలవశెట్టి శ్రీను, కార్యదర్శి మొగలి కనకలక్ష్మి కోరగా.. తప్పకుండా చేస్తానని పవన్‌ హామీ ఇచ్చారు.


పవన్‌ కల్యాణ్‌ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌లో సోమవారం సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో తాడేపల్లిగూడెం, ఉంగుటూరుల్లో జరగాల్సిన సభలు వాయిదా పడ్డాయి. వీటిని మరొకరోజు నిర్వహిస్తారని ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img