icon icon icon
icon icon icon

పవన్‌ కల్యాణ్‌ ఆస్తులు రూ.164.54 కోట్లు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, కుటుంబ సభ్యులకు కలిపి రూ.164.54 కోట్ల ఆస్తులు, రూ.65.77 కోట్ల అప్పులున్నాయి.

Published : 24 Apr 2024 05:43 IST

అప్పులు రూ.65.77 కోట్లు
వైకాపా హయాంలో 6 కేసులు

ఈనాడు, రాజమహేంద్రవరం: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, కుటుంబ సభ్యులకు కలిపి రూ.164.54 కోట్ల ఆస్తులు, రూ.65.77 కోట్ల అప్పులున్నాయి. ఇవి పవన్‌తోపాటు భార్య అన్నా, పిల్లలు దేశాయ్‌ అకీరానందన్‌, దేశాయ్‌ ఆద్య, కొణిదెల పోలినా అన్‌డ్జ్‌హనీ, కె.మార్క్‌శంకర్‌ పేరిట ఉన్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం ఆర్వో కార్యాలయంలో మంగళవారం పవన్‌ సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం.. మొత్తం చరాస్తులు రూ.46.18 కోట్లు. వీటిలో పవన్‌ పేరిట రూ.41.65 కోట్లు, భార్య పేరుతో రూ.కోటి, పిల్లల వద్ద రూ.90 లక్షల విలువైన చరాస్తులున్నాయి.

  • పవన్‌ వద్ద రూ.3.15 లక్షల నగదు, బ్యాంకుల్లో రూ.16.48 కోట్లు ఉన్నాయి. భార్య అన్నా చేతిలో రూ.19,340, బ్యాంకుల్లో రూ.86 లక్షలున్నాయి. పవన్‌ వద్దనున్న 1.6 కిలోల బంగారం, ఇతర ఆభరణాల విలువ రూ.2.34 కోట్లు. అన్నా నగల విలువ రూ.13.97 లక్షలు. కుమార్తె పోలినా పేరిట 50 గ్రాముల బంగారముంది.
  • పవన్‌ కుటుంబ సభ్యులకు రూ.14.01 కోట్ల విలువ చేసే 11 వాహనాలున్నాయి. వాటిలో 9 కార్లు.
  • మొత్తం స్థిరాస్తులు రూ.118.36 కోట్లు. వీటిలో పవన్‌ పేరుతో రూ.94.41 కోట్లు, భార్య పేరిట రూ.1.95 కోట్లు, పిల్లలు పోలినా, మార్క్‌శంకర్‌ పేరున చెరో రూ.11 కోట్ల విలువైన స్థిరాస్తులున్నాయి.

వదిన దగ్గర రూ.2 కోట్ల రుణం

వన్‌ వివిధ బ్యాంకుల నుంచి రూ.17.56 కోట్లు, వ్యక్తులు, సంస్థల వద్ద రూ.46.70 కోట్లు, ఇతరత్రా రూ.1.50 కోట్ల రుణం తీసుకున్నారు. రుణ మొత్తం రూ.65.77 కోట్లు. వదిన కొణిదెల సురేఖ వద్ద రూ.2 కోట్ల అప్పు తీసుకోగా, వీఆర్‌ విజయలక్ష్మి వద్ద రూ.8 కోట్లు, హారిక అండ్‌ హాసినీ క్రియేటివ్స్‌ నుంచి రూ.6.35 కోట్లు, మైత్రీ మూవీ మేకర్స్‌ వద్ద రూ.3 కోట్ల చొప్పున రుణం పొందారు.


ఆంధ్ర, తెలంగాణలో 8 కేసులు

వన్‌ కల్యాణ్‌పై తెలుగు రాష్ట్రాల్లో 8 కేసులు ఉండగా, వీటిలో వైకాపా అధికారంలోకి వచ్చాక 6 నమోదయ్యాయి. వాలంటీర్ల వ్యవస్థపై ఆరోపణలు చేశారంటూ 2023లో గుంటూరు, విజయవాడ, ఏలూరులో కేసులు పెట్టారు. విద్వేష ప్రసంగం చేశారని 2023 జులైలో ఏలూరు, విజయవాడలో 2 కేసులు నమోదయ్యాయి. వాహనాన్ని వేగంగా నడపడంతోపాటు రూఫ్‌ టాప్‌పై ప్రయాణించారంటూ 2022 నవంబరులో తాడేపల్లిలో కేసు నమోదైంది. కేసీఆర్‌పై విమర్శలు చేశారని 2018లో మహబూబాబాద్‌లో, మీడియాపై ఆరోపణలు చేశారని బంజారా హిల్స్‌ స్టేషన్‌లో మరో కేసు ఉంది.


చెల్లించిన పన్నులు రూ.73.92 కోట్లు

వన్‌ గత ఐదేళ్ల సంపాదన రూ.114.76 కోట్లు కాగా, ఆదాయ పన్ను రూపేణా రూ.47.07 కోట్లు చెల్లించినట్లు జనసేన పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. జీఎస్టీ కింద రూ.26.85 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది. ‘పవన్‌ కల్యాణ్‌ రూ.20 కోట్లకుపైగా విరాళాలు ఇచ్చారు. అందులో జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా, క్రియాశీలక కార్యకర్తలకు ప్రమాద బీమా సేవా కార్యక్రమాలకు రూ.17.15 కోట్లు, వివిధ సంస్థలకు విరాళాల కింద రూ.3.32 కోట్లు అందజేశారు. కేంద్రీయ సైనిక బోర్డు, పీఎం సిటిజన్‌ అసిస్టెన్స్‌ అండ్‌ రిలీఫ్‌ ఫండ్‌కు రూ.కోటి చొప్పున ఇచ్చారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ.50 లక్షల చొప్పున అందించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు రూ.30.11 లక్షలు, పవన్‌ కల్యాణ్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ ఎక్స్‌లెన్స్‌కు రూ.2 లక్షల విరాళమిచ్చారు.


నరేంద్రవర్మ ఆస్తులు రూ.109.47 కోట్లు

బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మ, ఆయన భార్య హరికుమారి దంపతుల ఉమ్మడి ఆస్తి రూ.109.47 కోట్లు. వర్మ పేరిట చరాస్తులు రూ.73.72 కోట్లు, స్థిరాస్తులు రూ.22.59 కోట్లు కలిపి మొత్తంగా రూ.96.31 కోట్లు ఉన్నాయి. అప్పు రూ.25.91 కోట్లు. హరికుమారికి రూ.11.29 కోట్ల చరాస్తులు, రూ.1.87 కోట్ల స్థిరాస్తులున్నాయి. వర్మకు సొంత కారు లేదు. ఆయనపై 9 పోలీసు కేసులున్నాయి. ఇవన్నీ వైకాపా ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో నమోదైనవే.


విష్ణుకుమార్‌రాజు ఆస్తులు రూ.106.22 కోట్లు

విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ భాజపా అభ్యర్థి పి.విష్ణుకుమార్‌రాజు, భార్య సీతాసుజాత ఉమ్మడి ఆస్తులు రూ.106.22 కోట్లు. ఆయన పేరిట ఉన్న స్థిరాస్తులు రూ.91.69 కోట్లు, చరాస్తులు రూ.2.90 కోట్లు, అప్పులు రూ.5.72 కోట్లు. భార్యకు రూ.10.14 కోట్ల స్థిరాస్తులు, రూ.1.49 కోట్ల చరాస్తులున్నాయి. ఆమె అప్పు రూ.1.67 కోట్లు. ఆయనపై ఒక పోలీసు కేసుంది. వీరికి వాహనాల్లేవు.


ప్రత్తిపాటి పుల్లారావుపై 13 కేసులు

ల్నాడు జిల్లా చిలకలూరిపేట తెదేపా అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుపై 13 కేసులున్నాయి. 2019లో కేసుల్లేకపోగా, వైకాపా అధికారంలోకి వచ్చాకే ఈ కేసులన్నీ పెట్టారు. పుల్లారావు దంపతుల పేరుతో చరాస్తులు రూ.55.70 కోట్లు, స్థిరాస్తులు 15.51 కోట్లు, అప్పులు రూ.35.90 కోట్లు ఉన్నాయి.


విజయసాయిరెడ్డిపై 11 సీబీఐ, 8 ఈడీ కేసులు

ఈనాడు, నెల్లూరు: నెల్లూరు లోక్‌సభ స్థానానికి వైకాపా అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన వేణుంబాక విజయసాయిరెడ్డి.. అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలు పొందుపరిచారు. అఫిడవిట్‌ ప్రకారం.. సీఎం జగన్‌పై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో రెండో నిందితుడి(ఏ-2)గా ఉన్న సాయిరెడ్డిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసులు 8, సీబీఐ కేసులు 11 ఉన్నాయి. వీటిపై న్యాయ విచారణ కొనసాగుతోంది. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ), అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లతో పాటు నేరపూరిత కుట్ర, మోసం తదితర సెక్షన్ల కింద కేసులున్నాయి. ఇటీవల కందుకూరులో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు 2 కేసులు నమోదయ్యాయి.

సాయిరెడ్డి కుటుంబ ఆస్తుల విలువ రూ.36.36 కోట్లు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, నివాస భవనాల విలువ రూ.29.32 కోట్లు. భార్య సునందారెడ్డి వద్ద రూ.4.46 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు ఉన్నాయి. వీరికి రూ.22.84 లక్షల అప్పుంది. 2022 మేలో రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్‌ వేసినప్పుడు సమర్పించిన అఫిడవిట్‌తో పోల్చితే.. ఆస్తులు రూ.14.79 కోట్లు పెరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img