icon icon icon
icon icon icon

జగన్‌ విధానాలు నచ్చకే రాజీనామా

ఎన్నికల వేళ వైకాపాకు షాక్‌ తగిలింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన వైకాపా నాయకుడు, రాష్ట్ర పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మెట్టకూరు చిరంజీవిరెడ్డి మంగళవారం తన పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Updated : 24 Apr 2024 06:17 IST

పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ చిరంజీవిరెడ్డి  

తాడేపల్లి, మంగళగిరి, న్యూస్‌టుడే: ఎన్నికల వేళ వైకాపాకు షాక్‌ తగిలింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన వైకాపా నాయకుడు, రాష్ట్ర పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మెట్టకూరు చిరంజీవిరెడ్డి మంగళవారం తన పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో తెదేపాలో చేరారు. లోకేశ్‌ పసుపు కండువాలు కప్పి చిరంజీవిరెడ్డి, ఆయన అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు.  చిరంజీవిరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్‌ విధానాలు నచ్చకే తాను తన పదవికి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తు, పోలీసుల సంక్షేమానికి కృషి చేస్తారనే నమ్మకం ఉందన్నారు. లోకేశ్‌ మాట్లాడుతూ జగన్‌ అధికారంలోకి వచ్చాక పోలీసు సోదరులకు అన్ని విధాలా నష్టం చేశారని విమర్శించారు. కొందరు ఉన్నతస్థాయి పోలీసు అధికారులు మాత్రం తమ వ్యక్తిగత స్వార్థం కోసం వ్యవస్థను పణంగాపెట్టి జగన్‌కు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక పోలీసులకు రావాల్సిన బకాయిలన్నీ చెల్లిస్తామని, ఖాళీగా ఉన్న కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేసి పనిభారం తగ్గిస్తామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img