icon icon icon
icon icon icon

డబ్బు ఆశ చూపి 3 రాజధానుల ఉద్యమం

బహుజన నాయకులకు డబ్బు ఆశ చూపి సీఎం జగన్‌ మూడు రాజధానుల ఉద్యమాన్ని నడిపించారని సోషల్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గురునాథం ఆరోపించారు.

Published : 24 Apr 2024 06:13 IST

సోషల్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు గురునాథం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: బహుజన నాయకులకు డబ్బు ఆశ చూపి సీఎం జగన్‌ మూడు రాజధానుల ఉద్యమాన్ని నడిపించారని సోషల్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గురునాథం ఆరోపించారు. ఉద్యమంలో పాల్గొన్న నాయకులకు రూ.25 లక్షలు, పొలం, కారు, కార్యకర్తలకు రోజుకు రూ.500 ఇస్తామని చెప్పి చివరికి మోసం చేశారని విమర్శించారు. ఈ మేరకు మంగళవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘మూడు రాజధానుల ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని, ఎంపీ నందిగం సురేష్‌ యథేచ్ఛగా దోచుకున్నారు. సజ్జల సీఎం జగన్‌ నుంచి అనంతవరంలో ఇసుక క్వారీని నజరానాగా పొందారు. ఉద్యమానికి రూ.100 కోట్లు ఖర్చయినట్లు చూపించి వాటిని పంచుకున్నారు. ఉద్యమం పేరు చెప్పి అమరావతిలో ఈ ముగ్గురూ భూములు కూడా పొందారు. ప్రవాసాంధ్రుల నుంచి రూ.కోట్లు కొట్టేశారు. మూడు రాజధానుల పేరు చెప్పి బహుజనులను మోసం చేశారు. జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఆయన ఓటమికి కృషి చేస్తాం’ అని గురునాథం పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img