icon icon icon
icon icon icon

అప్పుల రాష్ట్రాన్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతా!

అప్పుల రాష్ట్రాన్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతానని జైభారత్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు.

Published : 26 Apr 2024 05:40 IST

విశాఖ ఉత్తర నియోజకవర్గం అభ్యర్థిగా వి.వి.లక్ష్మీనారాయణ నామినేషన్‌

విశాఖపట్నం (గురుద్వారా), న్యూస్‌టుడే: అప్పుల రాష్ట్రాన్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతానని జైభారత్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం నామినేషన్‌ దాఖలు చేసేందుకు సీతమ్మధారలోని పార్టీ కార్యాలయం నుంచి కాలినడకన కార్యకర్తలతో కలిసి తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో) అఖిలకు నామినేషన్‌ పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దడానికి, రాష్ట్ర విధివిధానాలపై అసెంబ్లీలో ప్రశ్నించడానికి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడబడితే అక్కడ భూకబ్జాలేనని ఆరోపించారు. రూ.11లక్షల కోట్లతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీని.. బయటకు తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. విశాఖను పట్టిపీడిస్తున్న గంజాయి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తమ పార్టీ తరఫున వందమంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img