icon icon icon
icon icon icon

ఎంపీ అవినాష్‌రెడ్డికి నిరసన సెగ

వైయస్‌ఆర్‌ జిల్లా కడప లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అట్లూరులో ఇంటింటి ప్రచారం చేసేందుకు వచ్చిన వైకాపా ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే అభ్యర్థి సుధ, ఎమ్మెల్సీ గోవిందరెడ్డిలకు శుక్రవారం నిరసన సెగ తగిలింది.

Updated : 27 Apr 2024 06:49 IST

అట్లూరు, న్యూస్‌టుడే: వైయస్‌ఆర్‌ జిల్లా కడప లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అట్లూరులో ఇంటింటి ప్రచారం చేసేందుకు వచ్చిన వైకాపా ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే అభ్యర్థి సుధ, ఎమ్మెల్సీ గోవిందరెడ్డిలకు శుక్రవారం నిరసన సెగ తగిలింది. సోమశిల పునరావాస కాలనీ సమస్యలను స్థానికులు ఏకరవు పెట్టారు. తాగునీటి పైప్‌లైన్‌ నిర్మించాలని, విద్యుత్తు స్తంభాలు ఏర్పాటుచేయాలని, ఇంటి స్థలాలు కేటాయించాలని పింఛన్లు మంజూరు చేయాలని కోరారు.


తెదేపా ఎన్నికల సమన్వయకర్తల నియామకం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని తిరుపతి లోక్‌సభ ఎన్నికల సమన్వయకర్తగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. ఆమెతో పాటు ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా తాడిశెట్టి మురళిని నియమించినట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.


కడప రౌడీలను పిఠాపురం పంపించారు
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు

పిఠాపురం, న్యూస్‌టుడే: ‘కడప నుంచి రౌడీలను పంపించారు. పవన్‌ కల్యాణ్‌ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి, మంత్రి దాడిశెట్టి రాజా లాంటి కొందరి పాత్ర ఇందులో ఉంది. దీనిపై మాకు సమాచారం ఉంది’ అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ‘ఎక్స్‌’ వేదికగా శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మిథున్‌రెడ్డి వల్ల కావడం లేదని, కడప నుంచి రౌడీలను పంపించినట్లు తమకు సమాచారం వచ్చిందని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img