icon icon icon
icon icon icon

భువనేశ్వరి నకిలీ ఆడియోపై సీఈఓకు ఫిర్యాదు

నారా భువనేశ్వరి దళితులను తిడుతున్నట్లుగా నకిలీ వార్తలు సృష్టించి, ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాకు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు ఫిర్యాదు చేశారు.

Published : 27 Apr 2024 05:38 IST

ఎన్నికల్లో గెలవలేమనే వైకాపా దిగజారుడు రాజకీయాలు
తెదేపా నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: నారా భువనేశ్వరి దళితులను తిడుతున్నట్లుగా నకిలీ వార్తలు సృష్టించి, ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాకు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేసేవారిని గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలని సీఈఓను శుక్రవారం కోరారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు. ‘ఎన్నికల సంఘం ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా వైకాపా నాయకుల వ్యవహార శైలి మారడంలేదు. ఎవరితోనూ దురుసుగా మాట్లాడని నారా భువనేశ్వరిపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. దళితులను తిడుతున్నట్లుగా ఆడియో సృష్టించి సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేస్తున్నారు. ఎన్ని తప్పుడు పనులు చేసైనా అధికారం నిలబెట్టుకోవాలనుకోవడం సరికాదు. గెలుస్తామన్న నమ్మకం ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం’ అని సీఎం జగన్‌కు వర్ల సవాల్‌ చేశారు. ‘సొంత చెల్లి చీర గురించి మాట్లాడిన జగన్‌పై ప్రజలు ఆగ్రహం చెందారు. దాన్నుంచి దృష్టి మళ్లించేందుకే భువనేశ్వరిపై నకిలీ ఆడియో సృష్టించారు. రాజకీయ లబ్ధి కోసం మహిళలను కించపరిచేలా వార్తలు సృష్టించి, వారి గౌరవానికి భంగం కలిగించవద్దు’ అని దేవినేని ఉమా హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img