icon icon icon
icon icon icon

‘వైకాపా’ కూపన్లకు పెట్రోలిచ్చిన బంక్‌ లైసెన్స్‌ రద్దు

వైకాపా మద్దతుదారులిచ్చిన కూపన్లపై పెట్రోలు సరఫరా చేసిన బర్సానీ పెట్రోలియం ప్రొడక్ట్స్‌ పేరున నిర్వహిస్తున్న (రిలయన్స్‌) బంకు లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు విశాఖ జిల్లా సంయుక్త కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు.

Published : 27 Apr 2024 05:49 IST

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: వైకాపా మద్దతుదారులిచ్చిన కూపన్లపై పెట్రోలు సరఫరా చేసిన బర్సానీ పెట్రోలియం ప్రొడక్ట్స్‌ పేరున నిర్వహిస్తున్న (రిలయన్స్‌) బంకు లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు విశాఖ జిల్లా సంయుక్త కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘విశాఖ నగరం ఎన్‌ఎడీ కూడలిలోని సదరు పెట్రోలు బంకును జిల్లా స్థాయి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఈ నెల 19న తనిఖీ చేసింది. యాజమాన్యం తరఫు వ్యక్తులను విచారించగా విశాఖ పశ్చిమ వైకాపా అభ్యర్థి ఆడారి ఆనంద్‌కుమార్‌ మద్దతుదారులు పంపిణీ చేసిన కూపన్లపై 860 వాహనాలకు పెట్రోలు పోసినట్లు వెల్లడయింది. ఆ మొత్తం బిల్లును అభ్యర్థి మద్దతుదారులు అదే రోజు చెల్లించారు. ఈ చర్యలు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకు రావడంతో బంకు లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేశాం. కూపన్లు జారీ చేసిన వ్యక్తులపై పోలీసు కేసు నమోదు చేయాలని పశ్చిమ నియోజకవర్గ ఆర్వోను ఆదేశించాం’ అని కె.మయూర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img