icon icon icon
icon icon icon

ఖాకీ సోదరుల కష్టాలు తీర్చే బాధ్యత మాది

ఖాకీ సోదరుల కష్టాలు తీర్చే బాధ్యత మాది అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అన్నారు. ఆయన శనివారం విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో 70 వేల మంది పోలీసులను జగన్‌ ముంచేశారు.

Published : 28 Apr 2024 05:53 IST

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు

ఈనాడు, అమరావతి: ఖాకీ సోదరుల కష్టాలు తీర్చే బాధ్యత మాది అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అన్నారు. ఆయన శనివారం విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో 70 వేల మంది పోలీసులను జగన్‌ ముంచేశారు. జీతాలు సకాలంలో ఇవ్వరు. డీఏ బకాయిలు, సరెండర్‌ సెలవుల సొమ్ము, రవాణా భత్యం వంటివి ఏవీ ఇవ్వడంలేదు. వారాంతపు సెలవు అనే ఎన్నికల హామీని అమలు చేయలేదు. పోలీసుల దాచుకున్న జీపీఎఫ్‌ సొమ్ము రూ.1,100 కోట్లు దోచేశారు. ఎవరైనా తమ సొమ్ము పోతే పోలీసుల వద్దకు వెళ్తారు. మరి పోలీసులు ఎవరి వద్దకు వెళ్లాలి? 5,600 పోలీసు పోస్టుల భర్తీ చేయలేకపోయారు. పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ ప్రకాశ్‌బాబుని కొట్టిన వ్యక్తికి పోలీసుల కష్టాలు ఏం తెలుస్తాయి. పోలీస్‌ కుటుంబం నుంచి వచ్చిన పవన్‌కల్యాణ్‌కు ఆ కష్టాలన్నీ తెలుసు.  రాబోయే కూటమి ప్రభుత్వంలో ఖాకీ సోదరుల కష్టాలు తీర్చే బాధ్యత తీసుకుంటాం. వారి భత్యాలన్నీ అందేలా, వారాంతపు సెలవులు ఉండేలా చేస్తాం’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img