icon icon icon
icon icon icon

ఎమ్మెల్యేల పని రాళ్లు, మట్టి, ఇసుక తవ్వుకోవడమేనా?: డొక్కా

ఎమ్మెల్యేలకు నెలకు ఒకసారి అపాయింట్‌మెంట్‌ ఇస్తానని, రోజూ కార్యకర్తలను కలుస్తానని సీఎం జగన్‌ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పెడితే బాగుంటుందని తెదేపా నేత డొక్కా మాణిక్యవరప్రసాద్‌ సలహా ఇచ్చారు.

Published : 28 Apr 2024 05:58 IST

ఈనాడు, అమరావతి, తుళ్లూరు, న్యూస్‌టుడే: ఎమ్మెల్యేలకు నెలకు ఒకసారి అపాయింట్‌మెంట్‌ ఇస్తానని, రోజూ కార్యకర్తలను కలుస్తానని సీఎం జగన్‌ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పెడితే బాగుంటుందని తెదేపా నేత డొక్కా మాణిక్యవరప్రసాద్‌ సలహా ఇచ్చారు. గుంటూరు జిల్లా వెంకటపాలెంలో శనివారం మాట్లాడారు. ఎమ్మెల్యేలకు రాజకీయ కార్యకలాపాలు లేకుండా మట్టి, రాయి, ఇసుక తవ్వుకుంటే ప్రజలకు ఏం ఉపయోగమని నిలదీశారు. ఎమ్మెల్యేలంటే మట్టి, రాళ్ల్లు, ఇసుక తవ్వుకొని అమ్ముకునేవాళ్లేనా అని ప్రశ్నించారు. తన లాంటి సీనియర్‌ నేతలకు కనీసం మాట్లాడే అవకాశం కూడా వైకాపాలో ఇవ్వలేదంటే మిగతావారి పరిస్థితి  అర్థం చేసుకోవచ్చన్నారు. ‘సజ్జల రామకృష్ణారెడ్డి అణువణువునా అవమానించారని వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img