icon icon icon
icon icon icon

అరాచకాల్ని ప్రశ్నించినందుకే గోయల్‌పై విమర్శలు

రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల్ని ప్రశ్నించినందుకే కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌పై..  మంత్రి బొత్స సత్యనారాయణ అనవసర విమర్శలు చేస్తున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు.

Published : 28 Apr 2024 06:06 IST

బొత్సపై ఎన్డీయే నేతల ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల్ని ప్రశ్నించినందుకే కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌పై..  మంత్రి బొత్స సత్యనారాయణ అనవసర విమర్శలు చేస్తున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో భాజపా, తెదేపా, జనసేన అధికార ప్రతినిధులు లంకా దినకర్‌, పిల్లి మాణిక్యరావు, గౌతమ్‌ శనివారం విలేకరులతో మాట్లాడారు. ‘2020-21 ఆర్థిక సంవత్సరంలో విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ.106 కోట్లు కేటాయించింది. జగన్‌ ప్రభుత్వం సకాలంలో భూములు కేటాయించకపోవడంతో ఆ నిధులు మురిగిపోయాయి. కొంతకాలం తర్వాత రహదారి విస్తరణ కోసం రైల్వేభూములు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ శాఖను కోరింది. అలా ఇచ్చిన భూములకు బదులు ముడసర్లోవలోని తన భూములను రాష్ట్ర ప్రభుత్వం రైల్వేశాఖకు కేటాయించింది. వాటినే రైల్వేజోన్‌ కోసం ఇచ్చినట్లు వైకాపా నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ముడసర్లోవ భూమి ముంపు ప్రాంతం. అక్కడ భవనాలు నిర్మించడానికి వీలుపడదు’ అని లంకా దినకర్‌ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రలో రైల్వేజోన్‌ ఏర్పాటు సీఎం జగన్‌, బొత్సకు ఇష్టం లేదని పిల్లి మాణిక్యరావు విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img