icon icon icon
icon icon icon

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా వైకాపా మ్యానిఫెస్టో: మంత్రి బొత్స

పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా వైకాపా మ్యానిఫెస్టో రూపొందించామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో శనివారం ఆయన తన సతీమణి, విశాఖ వైకాపా ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

Updated : 28 Apr 2024 07:15 IST

విశాఖపట్నం (పెదవాల్తేరు), న్యూస్‌టుడే: పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా వైకాపా మ్యానిఫెస్టో రూపొందించామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో శనివారం ఆయన తన సతీమణి, విశాఖ వైకాపా ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీతో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశ రాజకీయాల్లో 99 శాతం మ్యానిఫెస్టో అమలుపరిచిన ఏకైక పార్టీ వైకాపా అని అన్నారు. చంద్రబాబునాయుడు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని మ్యానిఫెస్టోలో చేర్చారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img