icon icon icon
icon icon icon

రజినీ అఫిడవిట్‌ను ఆమోదించిన ఆర్వోపై చర్యలు తీసుకోవాలి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైకాపా అభ్యర్థిని విడదల రజిని సమర్పించిన అఫిడవిట్‌ తప్పులతడకని మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు ఆరోపించారు.

Published : 28 Apr 2024 06:14 IST

సీఈవోకు తెదేపా నేతల ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైకాపా అభ్యర్థిని విడదల రజిని సమర్పించిన అఫిడవిట్‌ తప్పులతడకని మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు ఆరోపించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని చూసిన విడదల రజిని అనే ఎస్సీ మహిళను పోలీసులతో కలిసి వైకాపా నేతలు కిడ్నాప్‌ చేశారని పేర్కొన్నారు. రజిని అఫిడవిట్‌ను క్షుణ్ణంగా పరిశీలించకుండా ఆమోదించిన ఆర్వో రాజ్యలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాకు శనివారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రతిని అదనపు ఎన్నికల అధికారి హరెంధిరప్రసాద్‌కు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img