icon icon icon
icon icon icon

సంక్షిప్త వార్తలు

సినీనటుడు, రచయిత చిట్టినేని లక్ష్మీనారాయణ రచించిన విజయం వీడియో సాంగ్‌ను హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌ ఆదివారం ఆవిష్కరించారు.

Published : 29 Apr 2024 05:42 IST

‘విజయం’ పాట ఆవిష్కరణ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సినీనటుడు, రచయిత చిట్టినేని లక్ష్మీనారాయణ రచించిన విజయం వీడియో సాంగ్‌ను హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌ ఆదివారం ఆవిష్కరించారు. ఎన్డీయే అభ్యర్థుల విజయావకాశాలు మెరుగుపరుస్తూ...ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఈ పాట ఉపయోగపడుతుందని రచయిత ఆకాంక్షించారు.


తెనాలి శాసనసభ వామపక్ష అభ్యర్థికి కాంగ్రెస్‌ మద్దతు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెనాలి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సీపీఐ (ఎంఎల్‌) పార్టీ అభ్యర్థి ఎస్‌.గోపాల్‌కి కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ప్రకటించింది. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయాన్ని నిలబెట్టే భాగస్వామ్య లక్ష్యంతోనే ‘ఇండియా’ కూటమి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం ఓ ప్రకటనలో కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. తాము కూడా గోపాల్‌కి మద్దతిస్తున్నామని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, వి.శ్రీనివాస్‌ మరో సంయుక్త ప్రకటన విడుదల చేశారు.


వైకాపా మ్యానిఫెస్టో అబద్ధాల పుట్ట: టి.శివశంకర్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా ఎన్నికల మ్యానిఫెస్టో తప్పుల తడకగా, అబద్ధాల పుట్టగా ఉందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్‌ ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు కేటాయించకుండానే వాటిని అమలు చేశామని జగన్‌ చెప్పడం హాస్యాస్పదమన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘అసత్య హామీలతో గద్దెనెక్కిన ప్రభుత్వం ప్రజలను నిలువునా ముంచింది. బీసీ సబ్‌ ప్లాన్‌ అమలు చేస్తున్నామని మ్యానిఫెస్టోలో చెప్పడం వంచించడమే’నని విమర్శించారు.


జనం ఆస్తులపై జగన్‌ పెత్తనమేంటి?: కె.రామకృష్ణ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రజల ఆస్తులకు సంబంధించిన అసలు ధ్రువపత్రాలు ఇవ్వకుండా నకలు ప్రతులను ఇచ్చేలా సబ్‌ రిజిస్ట్రార్‌లకు జగన్‌ ప్రభుత్వం ఆదేశాలిస్తూ ప్రజలను మోసం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. జనం ఆస్తులపై జగన్‌ పెత్తనమేంటని ఆదివారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. వివాదాలు సృష్టించి లబ్ధిపొందటం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్యని ఎద్దేవా చేశారు. ‘రాష్ట్రంలోని అన్ని ఆస్తులను తనఖా పెట్టిన జగన్‌ ఇప్పుడు ప్రజల స్థిరాస్తులపై పడ్డారు. ఇది వైకాపా నిరంకుశ, దుర్మార్గ పాలనకు నిదర్శనం’ అని రామకృష్ణ పేర్కొన్నారు.


కేంద్ర పథకాలతోనే వైకాపా మ్యానిఫెస్టో

ఈనాడు, అమరావతి: వైకాపా విడుదల చేసిన మ్యానిఫెస్టోలో కేంద్ర పథకాల పేర్లు మార్చి తమవిగా ప్రచారం చేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img