icon icon icon
icon icon icon

90,234 పోస్టల్‌ బ్యాలట్ల మార్పిడి

రాష్ట్ర సచివాలయంలో ఆదివారం ఎన్నికల విధుల్లో పాల్గొనే రెగ్యులర్‌ (ఫాం-12), అత్యవసర సేవల (ఫాం-12డి) ఉద్యోగులకు సంబంధించిన పోస్టల్‌ బ్యాలట్ల సెంట్రల్‌ ఎక్స్‌ఛేంజ్‌ కార్యక్రమం నిర్వహించారు.

Published : 29 Apr 2024 05:46 IST

ఇచ్చిపుచ్చుకున్న నోడల్‌ అధికారులు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్ర సచివాలయంలో ఆదివారం ఎన్నికల విధుల్లో పాల్గొనే రెగ్యులర్‌ (ఫాం-12), అత్యవసర సేవల (ఫాం-12డి) ఉద్యోగులకు సంబంధించిన పోస్టల్‌ బ్యాలట్ల సెంట్రల్‌ ఎక్స్‌ఛేంజ్‌ కార్యక్రమం నిర్వహించారు. అదనపు సీఈఓ హరీంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 26 జిల్లాల పోస్టల్‌ బ్యాలట్‌ నోడల్‌ అధికారులు పాల్గొన్నారు. తమ జిల్లాలకు చెందిన ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలట్లను వారు మార్పిడి చేసుకున్నారు. తొలి విడతగా 80,111 ఫాం-12లు, 10,123 ఫాం-12డీలు అందజేసినట్లు సీఈఓ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. అత్యధికంగా విశాఖ జిల్లా నుంచి 5,625, అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి అత్యల్పంగా 969 ఫాం-12 దరఖాస్తులు వచ్చాయి. ఫాం-12డీకి సంబంధించి అత్యధికంగా పల్నాడు జిల్లా నుంచి 999, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 25 దరఖాస్తులు అందాయి. మే 3న మళ్లీ సెంట్రల్‌ ఎక్స్‌ఛేంజ్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం ఖాళీ పోస్టల్‌ బ్యాలట్లను సంబంధిత ఉద్యోగులకు అందజేస్తారు. వారు ఓటేసిన తర్వాత ఆయా బ్యాలట్లను మే 10న తిరిగి ఇదే కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాలకు పంపుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img